Home గాసిప్స్ 3 కోట్ల బడ్జెట్ తో మంచి ప్రాఫిట్ దక్కించుకున్న….ఉమామహేశ్వర ఉగ్రరూపస్య!

3 కోట్ల బడ్జెట్ తో మంచి ప్రాఫిట్ దక్కించుకున్న….ఉమామహేశ్వర ఉగ్రరూపస్య!

0

బాహుబలి నిర్మాతలు అయిన ఆర్కా మీడియా వారు మలయాళంలో సూపర్ హిట్ అయిన మహేశింతే ప్రతీకారం సినిమా ను తెలుగు రీమేక్ రైట్స్ మంచి ఫ్యాన్సీ రేటు కి కొని తెలుగు లో సత్యదేవ్ హీరోగా రూపొందించారు, కాగా ఈ సినిమా లాక్ డౌన్ లేకుండా ఉంటే ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సింది కానీ మిగిలిన సినిమా లతో కలిసి ఆగిపోగా… లాక్ డౌన్ తర్వాత జనాలు మునుపటి లా భారీ సంఖ్యలో…

థియేటర్స్ లోకి వస్తారో రారో అన్న డౌట్ ఉన్న నేపధ్యంలో డైరెక్ట్ గా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతుందని సమాచారం. ఇది వరకు సినిమా డిజిటల్ డైరెక్ట్ రిలీజ్ కి 5.2 కోట్ల రేంజ్ రేటు ఆఫర్ వచ్చిందని తెలియగా… అందులో పూర్తీ నిజం లేడని తెలిసింది.

సినిమా ను ఫైనల్ గా OTT యాప్స్ 4.5 కోట్ల రేంజ్ రేటు చెల్లించి హక్కులను తీసుకున్నారని సమాచారం, ఇక సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ కింద 1.5 కోట్ల రేంజ్ రేటు దక్కిందని ఇండస్ట్రీ లో వార్తలు వస్తున్నాయి. ఇక హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ కింద మరో 1.2 కోట్ల రేంజ్ లో…

రేటు దక్కిందని అంటున్నారు. మ్యూజిక్ రైట్స్ అండ్ ఇతర రైట్స్ కింద మరో 20 లక్షల మేర సినిమా కి దక్కుతాయని అంటున్నారు కానీ వీటి పై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు. మొత్తం మీద ఇదే నిజం అయితే కనుక సినిమా మొత్తం మీద చేసిన బిజినెస్ లెక్కలు…7.4 కోట్ల రేంజ్ లో ఉండబోతున్నాయి అని చెప్పొచ్చు.

అదే సమయం లో సినిమా ఓవరాల్ బడ్జెట్ 3 కోట్ల రేంజ్ లోనే ఉండటంతో థియేట్రికల్ రిలీజ్ లేకున్నా కానీ నిర్మాతలకు మొత్తం మీద పెట్టిన పెట్టుబడి పై 4.4 కోట్ల మేర ప్రాఫిట్ దక్కినట్లే లెక్క అని చెప్పాలి. దాంతో సేఫ్ జోన్ లోనే ఇప్పుడు సినిమా నిర్మాతలు ఉండబోతున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకోబోతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here