బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ నాలుగు హిట్స్ ని సొంతం చేసుకున్న యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ థాంక్ యు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో నిరాశ పరిచిందో అందరికీ తెలిసిందే. మినిమమ్ అంచనాలను కూడా అందుకోలేక పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను సొంతం చేసుకుని నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా నిలిచింది.
కాగా సినిమా ఓవరాల్ గా పెట్టిన బడ్జెట్ మీద ఎంత బిజినెస్ జరిగింది, ఎంత కలెక్ట్ చేసింది, నిర్మాతకి లాభం వచ్చిందా లేక నష్టం వచ్చిందా లాంటి ప్రాఫిట్ షేర్ రిపోర్ట్ ను గమనిస్తే… మొత్తం మీద సినిమాను 30 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించగా…
ఓవరాల్ గా సినిమా బిజినెస్ వాల్యూ 24 కోట్ల దాకా ఉన్నప్పటికీ అందులో చాలా వరకు వాల్యూ బిజినెస్ ఉండగా ఓవరాల్ గా ఇతర బయర్స్ కి అమ్మిన బిజినెస్ 10 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…. మొత్తం మీద సినిమా డిజిటల్ రైట్స్ 5 కోట్ల రేటు ని సొంతం చేసుకోగా శాటిలైట్ రైట్స్ కింద…
మరో 5 కోట్లు రికవరీ అయ్యిందని సమాచారం. ఇక సినిమా హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ 4 కోట్లు పలికిందట. ఇక మ్యూజిక్ రైట్స్ 80 లక్షల దాకా రేటుని అందుకుందట. దాంతో టోటల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ 14.80 కోట్లు రికవరీ అవ్వగా థియేట్రికల్ బిజినెస్ లో 10 కోట్ల బిజినెస్ ను అందుకుంది…. అంటే టోటల్ గా జరిగిన బిజినెస్ 24.80 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుంది…
అంటే టోటల్ గా 30 కోట్లు పెట్టి సినిమా తీస్తే సినిమా టోటల్ బిజినెస్ రికవరీ పక్కకు పెడితే 5.2 కోట్ల రేంజ్ లో నష్టాన్ని దక్కించుకుంది. 4 బాక్ టు బాక్ హిట్స్ కొట్టిన హీరో సినిమా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ తో కూడా ప్రాఫిట్స్ ను నిర్మాతకి రప్పించ లేక పోవడం విచారకరం అనే చెప్పాలి. ఆల్ ఇన్ ఆల్ అన్ని వైపులా ఈ సినిమా ఎపిక్ డిసాస్టర్ అనే చెప్పాలి.