Home గాసిప్స్ హీరోని రిజక్ట్ చేసిన నితిన్….కారణం ఇదేనట!!

హీరోని రిజక్ట్ చేసిన నితిన్….కారణం ఇదేనట!!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఆడియన్స్ ముందుకు పరిచయం అయిన లేటెస్ట్ మూవీ హీరో బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి రేసులో అన్ని సినిమాల తర్వాత ఆడియన్స్ ముందుకు రాగా సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ పర్వాలేదు అనిపించే విధంగా మెప్పించినా కానీ కంటెంట్ అనుకున్న రేంజ్ లో రీచ్ అవ్వక పోవడంతో వర్కింగ్ డేస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం స్లో డౌన్ అయింది..

కాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తీ అయ్యి రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా సంక్రాంతికి పెద్ద సినిమాలు రేసు నుండి తప్పుకోవడంతో ఈ సినిమా కి అడ్వాంటేజ్ లభించింది. దాంతో కలెక్షన్స్ అడ్వాంటేజ్ లభిస్తుంది అనుకున్నా 3rd వేవ్ అండ్ బంగార్రాజు ఇంపాక్ట్ కూడా…

ఈ సినిమా పై పడింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాను ముందు యూత్ స్టార్ నితిన్ దగ్గరకు తీసుకుని వెళ్లారట. తన దగ్గరే సినిమా కొంత టైం వరకు ఉండగా ఫస్టాఫ్ వరకు కథ బాగా నచ్చిందట నితిన్ కి కూడా, కానీ సెకెండ్ ఆఫ్ లో కథ…

మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని, ఆ మార్పులు జరిగితే కన్ఫాం గా చేద్దామని నితిన్ చెప్పినా మార్పులకు ఒప్పుకోక పోవడం, ఈ లోపు నితిన్ ఇతర ప్రాజెక్ట్ లు ఒప్పుకోవడంతో మెల్లగా ఈ ప్రాజెక్ట్ సైడ్ అయిపోయిందని సమాచారం… తర్వాత డైరెక్టర్ ఈ కథని అనుకోకుండా అశోక్ గల్లాకి వినిపించడం, కథ ఓకే అయ్యి ఇప్పుడు లాంచ్ మూవీగా ఆడియన్స్ ముందుకు రావడం…

జరగగా నితిన్ చెప్పినట్లుగానే ఫస్టాఫ్ వరకు ఎంటర్ టైన్ మెంట్ అందరికీ నచ్చినప్పటికీ సెకెండ్ ఆఫ్ కథ అనుకున్న విధంగా లేక పోవడం వలన హీరో జస్ట్ యావరేజ్ రేంజ్ లోనే ఆడియన్స్ ను మెప్పించింది… సెకెండ్ ఆఫ్ మరింత బాగా కథని రాసుకుని ఉంటే సినిమా ఇంకా బెటర్ టాక్ ని రిజల్ట్ ని సొంతం చేసుకుని ఉండేదని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here