Home న్యూస్ 105 రోజుల్లో…..3 సినిమాలు…నితిన్ ఊరమాస్ కుమ్ముడు ఇది!

105 రోజుల్లో…..3 సినిమాలు…నితిన్ ఊరమాస్ కుమ్ముడు ఇది!

0

ఒక్క ఏడాది స్టార్స్ ఒక్క సినిమాకే చాలా కష్టపడుతూ ఉంటారు, ఇక పాండమిక్ టైం లో అనేక సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ రాగా చాలా సినిమాల షూటింగ్ లు డిలే అవుతూ వచ్చాయి. దాంతో ఇప్పుడు స్టార్స్ అందరూ కూడా వరుస పెట్టి సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర చేయడానికి సిద్ధం అవుతున్నారు, ఈ ఇయర్ కి గాను మిగిలిన హీరోల లెక్క ఎలా ఉన్నా కానీ యూత్ స్టార్ నితిన్ మాత్రం…

సెన్సేషనల్ లైనప్ తో దుమ్ము దుమారం చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా అందరు హీరోల లెక్క ఒకెత్తు నితిన్ లెక్క మరో ఎత్తు అనిపించే విధంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు ఈ ఇయర్ రాబోతుంది, అదొక రికార్డ్ అయితే మరో రికార్డ్ ఏంటి అంటే…

అవన్నీ కూడా ఇయర్ మొదటి అర్ధభాగంలోనే రాబోతున్న సినిమాలు అవ్వడం మరో విశేషం కాగా అవి కూడా కేవలం 105 రోజుల గ్యాప్ లో ఏకంగా మూడు సినిమా లతో సందడి చేయ బోతున్నాడు నితిన్. ముందుగా చెక్ మూవీ తో ఈ నెల 26 న సందడి చేయ బోతున్నాడు నితిన్.

ఈ సినిమా వచ్చిన నెల తర్వాత ఆడియన్స్ ముందు కు లాస్ట్ ఇయర్ సమ్మర్ కానుకగా రావాల్సిన రంగ్ దే సినిమాను మార్చ్ 26 న రిలీజ్ చేయబోతుండగా ఈ సినిమా వచ్చిన రెండున్నర నెలల గ్యాప లోనే మరో సినిమా ను రిలీజ్ చేయబోతున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన అంధదూన్ సినిమా తెలుగు రీమేక్ రిలీజ్ డేట్ ని రీసెంట్ గా అనౌన్స్ చేశారు.

సినిమాను ఆడియన్స్ ముందుకు జూన్ 11 న తేబోతున్నారు మేకర్స్… ఇంకా టైటిల్ కన్ఫాం కానీ ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దాంతో మొదటి అర్ధభాగంలోనే మూడు సినిమాలతోనే సందడి చేయబోతున్న నితిన్ సెకెండ్ ఆఫ్ లో మరో సినిమా కూడా దింపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అన్నీ అనుకున్నట్లు జరిగి అన్నీ హిట్ కొడితే నితిన్ రేంజ్ మరో లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here