కొన్ని కొన్ని సినిమాలు థియేటర్స్ లో కన్నా ఇంట్లో చూసినప్పుడో లేదో మొబైల్ లో సింగిల్ గా చూసినప్పుడో ఎక్కువ నచ్చుతాయి, కొన్ని సినిమాలు థియేటర్స్ లోనే నచ్చుతాయి. రీసెంట్ గా ఇలా కొన్ని సినిమాలు ఆడియన్స్ కి థియేటర్స్ లో నచ్చగా కొన్ని సినిమాలు సింగిల్ గా ఇంట్లో చూసినప్పుడు నచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ కోవలోకి చేరిన కొత్త సినిమా గా నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ అని చెప్పాలి.
ఈ సినిమా సమ్మర్ కానుకగా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి రివ్యూలు సూపర్ పాజిటివ్ గా వచ్చాయి. ఉరి, బేబీ లాంటి సినిమాల రేంజ్ కి ఏమాత్రం తీసిపోకుండా సినిమా ఉందని చూసిన వాళ్ళు మెచ్చుకోగా. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నాగార్జున కి…
ఈ సినిమా తో కంబ్యాక్ ఖాయమని అంతా భావించారు కానీ అలా జరగలేదు.. సినిమా బాగున్నా జనాలు సినిమాని చూడటానికి థియేటర్స్ కి రాలేదు, దానికి మరో రీజన్, సినిమాలో డైలాగ్స్ ఎక్కువ భాగం ఇంగ్లీష్ లేదా హిందీ లో ఉండటం బి సి సెంటర్స్ లో ఇబ్బంది పెట్టి ఉండొచ్చు.
దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ లేక రిలీజ్ అయిన 19 వ రోజున డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా డిజిటల్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియా లో సూపర్ రెస్పాన్స్ ను ఊహించినట్లే సొంతం చేసుకుంటుంది, నెట్ ఫ్లిక్స్ లో రీసెంట్ టైం లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూయర్ షిప్ ను ఈ సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు.
సినిమా చూసిన వాళ్ళు ఇలాంటి మంచి సినిమా థియేటర్స్ లో మిస్ అయ్యామే అంటూ ఇప్పుడు సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి కాన్సెప్ట్ మూవీ కి థియేటర్స్ కన్నా OTT రిలీజ్ ముందే చేసి ఉంటే రెస్పాన్స్ ఇంకా డబుల్ ట్రిపుల్ ఉండి ఉండేది, కానీ థియేటర్స్ రిలీజ్ వలన కలెక్షన్స్ లేక ఫ్లాఫ్ అనిపించుకున్నా ఇప్పుడు డిజిటల్ హిట్ అనిపించుకుంటుంది ఈ సినిమా..