Home TRP రేటింగ్ 8 ఏళ్ల క్రితం సినిమాతో ఎన్టీఆర్ మాస్…భోజ్ పూరిలో లాస్ట్ వీక్ టాప్ TRP

8 ఏళ్ల క్రితం సినిమాతో ఎన్టీఆర్ మాస్…భోజ్ పూరిలో లాస్ట్ వీక్ టాప్ TRP

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా దమ్ము అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, 2012 లో బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ హైప్ తో రిలీజ్ అయిన ఈ సినిమా లలో ఒకటిగా నిలవగా సినిమా కి టాక్ అంత పాజిటివ్ గా రాలేదు. అయినా కానీ ఎన్టీఆర్ బోయపాటి సినిమా పై ఉన్న క్రేజ్ దృశ్యా సినిమా….

బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని సాధించగా ఫైనల్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ కి క్లోజ్ గా వచ్చి మొత్తం మీద సెమీ హిట్ రేంజ్ లో ఆగిపోయింది. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన 8 ఏళ్ల తర్వాత సినిమాను ఇతర భాషలో డబ్ చేసి రిలీజ్ చేశారు.

హిందీ డబ్బింగ్ వర్షన్ ఆల్ రెడీ యూట్యూబ్ లో ఇది వరకే మంచి వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా సినిమా రీసెంట్ గా భోజ్ పూరి భాషలో డబ్ అయ్యి టెలికాస్ట్ అయ్యింది. కాగా సినిమాకి మొత్తం మీద 23.82 లక్షల ఇంప్రెషన్స్ అంటే సింపుల్ లెక్కల్లో చెప్పాలి అంటే…

అక్కడ సినిమా 3.1 రేంజ్ లో రేటింగ్ దక్కింది…. రిలీజ్ అయిన 8 ఏళ్ళకి అక్కడ టెలికాస్ట్ అవ్వడం లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల్లో మొదటి ప్లేస్ లో నిలవడం విశేషం అనే చెప్పాలి. ఇక టాప్ 5 లిస్టులో 4 తెలుగు సినిమాలే అక్కడ నిలవడం మరో విశేషం అని చెప్పొచ్చు. ఇక మిగిలిన సినిమాల విషయానికి వస్తే..

సూర్య సింగం 2, రామ్ ఎందుకంటే ప్రేమంట, బాహుబలి పార్ట్ 2 మరియు భరత్ అనే నేను/అతడు సినిమాలు టాప్ 5 లో నిలిచాయి. మొత్తం మీద తెలుగు సినిమాల్లో అన్నింటిలోకి ఓల్డ్ రిలీజ్ అయినప్పటికీ లాస్ట్ వీక్ మూవీస్ లో అక్కడ టాప్ రేటింగ్ తో దుమ్ము లేపింది ఎన్టీఆర్ దమ్ము సినిమా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here