Home న్యూస్ వినయ విధేయ రామ ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

వినయ విధేయ రామ ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

      మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విదేయ రామ భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, సినిమా పై నెలకొన్న హైప్ దృశ్యా భారీ రిలీజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ని పూర్తి చేసుకోగా అక్కడ నుండి ముందుగా సినిమా కి ఎలాంటి టాక్ లభిస్తుందో తెలుసుకుందాం పదండీ..

స్టొరీ లైన్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా కానీ అన్నదమ్ములలో ఒకరి కి వచ్చిన సమస్య కి హిరో ఎదురు నిలవడం అన్న కాన్సెప్ట్ తో సినిమా వచ్చిందని, బోయపాటి మరోసారి రొటీన్ ఫార్మాట్ నే ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చాడని అంటున్నారు.

కథ పాయింట్ ఎలా ఉన్నా మాస్ ఆడియన్స్ ని అలరించే విధంగా యాక్షన్ సీన్స్ మోతాదుకి మించి పెట్టాడని, సెకెండ్ ఆఫ్ లెంతీ ఫైట్ సీన్స్ బాగున్నా పదే పదే రిపీట్ అవ్వడం ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బంది పెట్టె విషయమే అని అంటున్నారు.

రామ్ చరణ్ రంగస్థలం ఎక్స్ ట్రా ఆర్డినరీ పెర్ఫార్మెన్స్ తర్వాత ఈ సారి పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయడానికి ఏమి దొరకలేదని, యాక్షన్ సీన్స్ తోనే సరిపెట్టేలా ఉన్న స్క్రిప్ట్ కి తన వరకు ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడని అంటున్నారు, ఇక మిగిలిన స్టార్ కాస్ట్ ఎంతో మంది ఉన్నా పూర్తిగా రామ్ చరణ్ వన్ మ్యాన్ శో అని అంటున్నారు.

సంగీతం ఏమాత్రం ఆకట్టుకోలేదని, కానీ రామ్ చరణ్ డాన్సులతో పాటలు చూసేలా చేశాడని అంటున్నారు, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మరీ అద్బుతంగా లేక పోయినా పర్వాలేదు అనిపించింది అంటున్నారు, ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

డైరెక్షన్స్ పరంగా రొటీన్ ఫార్మాట్ లోనే వరుస పెట్టి సినిమాలు చేస్తున్న బోయపాటి ఈ సారి అంచనాలను పూర్తిగా అందుకోలేక పోయాడని అంటున్నారు, ఇది ఫ్యాన్స్ ఇష్టపడే యాక్షన్ సన్నివేశాల కోసం తీసిన సినిమాల ఉందని వారు చెబుతున్నారు.

మొత్తం మీద ఓవర్సీస్ ఆడియన్స్ నుండి మాస్ సినిమాలకు ఇలాంటి టాక్ సహజమే అని చెప్పాలి, బోయపాటి అన్ని సినిమాలకు ఓవర్సీస్ లో ఇలాంటి టాకే ఎక్కువగా వస్తు ఉంటుంది, ఇక ఇప్పుడు రెగ్యులర్ కామన్ ఆడియన్స్ నుండి వచ్చే టాక్ ఎలా ఉంటుందో అన్నది ఆసక్తి గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here