Home న్యూస్ 51 కోట్ల టార్గెట్….3 రోజుల్లో వచ్చింది ఇది…ఎపిక్ డిసాస్టర్

51 కోట్ల టార్గెట్….3 రోజుల్లో వచ్చింది ఇది…ఎపిక్ డిసాస్టర్

384
0

     నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్ల మూడి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ మహానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది.. ఎంతలా అంటే టాలీవుడ్ చరిత్ర లో ఒక స్టార్ హీరో సినిమా కి 2.75 స్టార్ టు 3 స్టార్ రేటింగ్ ని తెచ్చుకున్న ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి షాకింగ్ కలెక్షన్స్ సాధించ లేనంత లెవల్ లో బొక్క బోర్లా పడింది ఈ సినిమా.

మొదటి రోజే అండర్ పెర్ఫార్మ్ చేస్తూ కేవలం 2.12 కోట్ల షేర్ ని మాత్రమె అందుకున్న ఈ సినిమా రెండో రోజు టోటల్ గా 60 లక్షల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని షాక్ ఇచ్చింది, ఇక సినిమా మూడో రోజు నెగటివ్ షేర్ ల ఇంపాక్ట్ తో మరింత క్షీణించింది.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 3 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంది ఈ సినిమా. కాగా మొదటి పార్ట్ 70.5 కోట్ల బిజినెస్ కి 20.4 కోట్ల షేర్ తో 50.1 కోట్ల లాస్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ ఆల్ టైం డిసాస్టర్ గా మిగిలి పోయిన విషయం తెలిసిందే.

కాగా రెండో పార్ట్ కి ముందు బయ్యర్లకి నష్టపరిహారం ఇస్తానని బాలయ్య చెప్పినా ఇప్పటి వరకు వాటి పై ఎలాంటి న్యూస్ లేకపోవడం తో టెక్నికల్ గా ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా బిజినెస్ టార్గెట్ 51 కోట్లు అని చెప్పాల్సి వస్తుంది. ఆ రేంజ్ టార్గెట్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర….

ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా 3 రోజుల్లో 3 కోట్ల షేర్ ని మాత్రమె అందుకుని ఎపిక్ డిసాస్టర్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ గా మారగా ఫైనల్ రన్ లో 5 కోట్ల రేంజ్ ని కూడా అందుకోవడం కష్టం అని చెబుతుండటంతో చరిత్ర తిరగరాసే డిసాస్టర్ గా సినిమా నిలిచి పోవడం ఖాయం అంటున్నారు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here