Home న్యూస్ ఇదే ఫైనల్…షాకింగ్ ఫైనల్ టాక్!

ఇదే ఫైనల్…షాకింగ్ ఫైనల్ టాక్!

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్ల మూడి ల కాంబినేషన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండో పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా స్పెషల్ షోలకి ఎబో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకోగా రెగ్యులర్ షో లకు కూడా అదే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది, ఇక సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి…

అసలు సిసలు సినీ పోషకులు అయిన కామన్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారింది, కానీ ఇక్కడ టాక్ కొంచం డివైడ్ గా ఉందని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ లో కొంచం ఏజ్ ఉన్న వాళ్ళు…

ఎన్టీఆర్ గురించి తెలిసిన వాళ్ళు బయట ఒకటి జరిగితే సినిమా లో ఒకటి చూపెట్టారు అంటూ కొంచం గుర్రు గానే ఉన్నారు, ఇక మిగిలిన ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సినిమాలో బాలయ్య విద్యాబాలన్ ల పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉండటం ఆకట్టుకుంది అంటున్నారు.

ఇక కామన్ ఆడియన్స్ మాత్రం బయట వినిపిస్తున్న వార్తలలో ఒకటి కూడా చూపెట్టలేదని, అసలు బయోపిక్ అంటే కీలక గట్టాలతో పాటు ఎన్టీఆర్ ఎలాంటి పరిస్థితులలో స్వర్గస్తులయ్యాడు అనేవి కూడా చూపుతారు అనుకున్నా వాళ్ళకి కావాల్సిన సన్నివేశాలు మాత్రమె పెట్టారని అంటున్నారు.

ఇవన్నీ పక్కకు పెడితే సినిమా మాత్రం ఒకసారి చూసే విధంగా ఉందని, అంతకి మించి మెచ్చుకోవడానికి ఏమి లేదని టాక్ బయట ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, మొత్తం మీద ఈ టాక్ ఫైనల్ అని చెప్పొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఫేట్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here