Home న్యూస్ ఎన్టీఆర్ మహానాయకుడు రివ్యూ రేటింగ్…ప్లస్& మైనస్ పాయింట్స్

ఎన్టీఆర్ మహానాయకుడు రివ్యూ రేటింగ్…ప్లస్& మైనస్ పాయింట్స్

0

     మంచి అంచనాల నడుమ సంక్రాంతి కి వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు నిరాశ పరచగా ఇప్పుడు రెండో పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు కొంచం లేట్ అయినా వచ్చేసింది, మరి రెండో పార్ట్ తో అయినా ప్రేక్షకుల మనసు ని బాలయ్య గెలుచుకున్నాడో లేదో తెలుసు కుందాం పదండి… ముందుగా స్టొరీ పాయింట్ గురించి చెప్పాలంటే… పొలిటికల్ లైఫ్ లో ఎంటర్ అయ్యాక ఎన్టీఆర్ కి పార్టీ లో అంతర్గత యుద్ధం ఎలా మొదలైంది…

తనని పార్టీ నుండి బయటికి పంపాలని ఎలాంటి పనులు చేశారు, వాటినన్నింటికి ఎదిరించి ఎలా ఎన్టీఆర్ తిరిగి పార్టీ ని తన వశం చేసుకున్నారు… తన వ్యక్తిగత జీవితం పై ఆ ప్రభావం ఎంతవరకు పడింది ఇలాంటి అంశాలన్నీ రెండో పార్ట్ లో చూపెట్టేరారు.

ఓవరాల్ గా ముందు హైలెట్స్ విషయానికి వస్తే
* తారకం రాముడిలా బాలయ్య విద్యాబాలన్ పెర్ఫార్మెన్స్ కుమ్మెశారు
* రన్ టైం మరియు స్క్రీన్ ప్లే పెర్ఫెక్ట్ గా ఉండటం
* కీరవాణి సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్
* ఇంటర్వెల్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్
* రానా దగ్గుబాటి కి పెట్టిన ఎలివేషన్ సీన్స్…. ఇవి సినిమాలో మేజర్ హైలెట్స్ సీన్స్

ఇక సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే
*బయట ఎన్టీఆర్ పై ఉన్న వార్తలకు పూర్తీ విరుద్దంగా సినిమా ఉండటం
*చంద్రబాబు నాయుడు పై బయట ఉన్న కథనాలకు పూర్తీ విరుద్దంగా చూపెట్టడం
*భజన చేసే విధంగా కొన్ని సన్నివేశాలు కల్పించి మరీ పెట్టడం
*ఎన్టీఆర్ సంపూర్ణ బయోపిక్ అని చెప్పి 1984 వరకు మాత్రమె చూపెట్టడం

ఇవీ ఓవరాల్ గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్… సినిమా ఆల్ మోస్ట్ మొదటి పార్ట్ రేంజ్ లోనే ఉన్నా ఇక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని ఉండటం, రన్ టైం తక్కువ ఉండటం, స్క్రీన్ ప్లే బాగుండటం కలిసి వచ్చే ముఖ్య అంశాలు, ఇక బాక్స్ ఆఫీస్ ఫేట్ ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది.

ఓవరాల్ గా సినిమా ఎన్టీఆర్ బయోపిక్ కి సంపూర్ణ కథ కాదు, కానీ ఉన్నంతలో కొన్ని వివాదాలు పక్కకు పెడితే ఎన్టీఆర్ జీవితం లో చాలా వరకు నేటి యువతకి తెలియని కథ చెప్పి మెప్పించాడు దర్శకుడు క్రిష్. సినిమాకి ఫైనల్ రేటింగ్ 3 స్టార్స్… ఇక బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here