బాలయ్య కెరీర్ లో రీసెంట్ టైం లో అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకున్నాయి. హిస్టారికల్ మూవీ అయిన గౌతమి పుత్ర శాతకర్ణి కొంచం బెటర్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఇక్కడ మరియు ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్స్ ని అందుకుంది, ముఖ్యంగా ఓవర్సీస్ లో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా…
బాలయ్య కెరీర్ లో బెస్ట్ అనిపించే విధంగా ఏకంగా 0.48 టు 0.5 మిలియన్ రేంజ్ లో ప్రీమియర్ షోల ద్వారా కలెక్షన్స్ ని అందుకుని సత్తా చాటింది, సంక్రాంతి ఎఫెక్ట్ కూడా కలిసి మంచి ఓపెనింగ్స్ తో కుమ్మేసింది, ఇక ఇప్పుడు సినిమా లోని రెండో పార్ట్ అయిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా..
బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా సినిమా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో సాదారణంగా ఓపెన్ అవ్వగా ఓవర్సీస్ లో అయినా బాగా ఓపెన్ అవుతుంది అనుకుంటే అక్కడ కూడా షాక్ ఇచ్చే రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది.
సినిమా అక్కడ ప్రీమియర్ షో ల ద్వారా టోటల్ గా 80 వేల డాలర్స్ కి అటూ ఇటూ గా నే కలెక్షన్స్ ని సాధించి షాక్ ఇచ్చింది. ఎలాంటి పోటి లేకుండా సోలో గా అక్కడ రిలీజ్ అయిన బిగ్ మూవీ ఇదే అయినా కానీ ఈ ఓపెనింగ్స్ అందరికీ షాక్ ఇచ్చాయి.
మొదటి పార్ట్ నష్టాల తర్వాత రెండో పార్ట్ అక్కడ ఎంత లేదన్నా పెట్టిన డబ్బు రికవరీ అవ్వాలంటే 1.4 మిలియన్ వరకు కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుందని సమాచారం. మరి లాంగ్ రన్ లో సినిమా అక్కడ ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.