తెలుగు లో ప్రతీ సినిమా క్రేజ్ కి నిదర్శనం పలికేవి రిలీజ్ కి ముందు సోషల్ మీడియా రికార్డులు…రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ రికార్డులు అని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ రికార్డులకు ఇంకా సమయం ఉండగా ఎన్టిఆర్ అరవింద సమేత ఫస్ట్ లుక్ అండ్ టీసర్ లు సెంసేషన్ ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
ఇక సాంగ్స్ పరంగా డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు అని సడెన్ గా ఒక సాంగ్ ని రీసెంట్ గా కొన్ని గంటల ముందే చెప్పడంతో 24 గంటల్లో సరికొత్త రికార్డులు తిరగరాయకపోయిన వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది.
ఇక ఇప్పుడు రెండో సాంగ్ 19 న సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు రిలీజ్ కానుండటంతో 24 గంటల విషయంలో టాప్ లో ఉన్న భరత్ అనే నేను దిస్ ఈజ్ మీ 3.15 మిలియన్స్ అండ్ 187k లైక్స్ ని 24 గంటల్లో ఈ సాంగ్ బ్రేక్ చేస్తుందా లేదా అన్నది ఆసక్తి గా మారింది…