Home గాసిప్స్ రామ్ చరణ్ ఏంటి…ఇంత షాక్ ఇచ్చాడు!

రామ్ చరణ్ ఏంటి…ఇంత షాక్ ఇచ్చాడు!

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా వచ్చి ఏడాదిన్నర అయింది… లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వినయ విధేయ రామ తో వచ్చిన రామ్ చరణ్ తర్వాత టైం మొత్తాన్ని ఆర్ ఆర్ ఆర్ కోసమే కేటాయిస్తూ వస్తున్నాడు. అందులో హీరోగా బయట నిర్మాతగా చిరంజీవి సినిమాలను నిర్మించే పనులతో ఫుల్ బిజీ గా ఉన్నాడు రామ్ చరణ్. దాంతో తన అప్ కమింగ్ మూవీ ఎవరితో అన్నది క్లారిటీ లేకుండా పోయింది అని చెప్పాలి.

కథలు చాలా మంది వినిపించగా లేటెస్ట్ గా మరో డైరెక్టర్ కథని రామ్ చరణ్ విన్నారని, విని ఓకే చెప్పారని లేటెస్ట్ టాక్… చాలా లేట్ గా సినిమాలు చేస్తాడని, బడ్జెట్ పెంచుటాడని చిన్న చిన్న అపవాదులు ఉన్న వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో రామ్ చరణ్…

కొత్త సినిమా చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. వంశీ పైడిపల్లి ముందుగా మహేష్ తో సినిమా చేయాలనీ ట్రై చేసినా మహేష్ అప్పటికే సర్కారు వారి పాట కమిట్ అవ్వగా తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ తో కొత్త సినిమా కథ చెప్పడం తో రామ్ చరణ్ ఓకే చెప్పారని…

టాలీవుడ్ లో లేటెస్ట్ గా బజ్ వినిపిస్తుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ రామ్ చరణ్ నుండి అప్ కమింగ్ మూవీ గా పాన్ ఇండియా సినిమా రావాలి అని కోరుకుంటున్న సమయం లో మరోసారి లోకల్ మూవీ న్యూస్ రావడం తో వాళ్ళు కొద్దిగా నిరాశలో ఉన్నారని టాక్.. అదే సమయంలో వంశీ పైడిపల్లి ఇది వరకే రామ్ చరణ్ తో…

ఎవడు లాంటి కమర్షియల్ మూవీ తీయడంతో ఈ సారి ఇలాంటి సినిమా వస్తుందా లేదా అన్న డౌట్ కూడా ఉంది. ఇంకా అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయని ఈ సినిమా నిజం అయితే పాన్ ఇండియా మూవీ అవ్వాలని ఫ్యాన్స్ కోరిక. మరి రామ్ చరణ్ ఎం చేస్తాడో చూడాలి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here