Home న్యూస్ 9 ఏళ్ల నిరీక్షణ…ఇప్పటికి ఎండ్….ఇది అఫీషియల్ ఇక!!

9 ఏళ్ల నిరీక్షణ…ఇప్పటికి ఎండ్….ఇది అఫీషియల్ ఇక!!

0

కామెడీ మూవీస్ తో ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను ఆకట్టుకుని, టాలీవుడ్ లో రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ జానర్ లో అంతటి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో అల్లరి నరేష్, మినిమమ్ గ్యారెంటీ హీరోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇయర్ కి 4 సినిమాలకు తగ్గకుండా సినిమాలను రిలీజ్ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర 8-10 కోట్ల రేంజ్ మార్కెట్ ని సొంతం చేసుకున్న అల్లరి నరేష్ సుడిగాడు సినిమా తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.

2012 లో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ కొట్టిన ఆ సినిమా తర్వాత అల్లరి నరేష్ కెరీర్ లో చేసిన ప్రతీ సినిమా కూడా మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రావడం, సినిమా బాలేక పోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవ్వడం కామన్ అయ్యిపోయింది.  దాంతో రాను రాను అల్లరి నరేష్…

మార్కెట్ పై అది ఇంపాక్ట్ చూపగా కలెక్షన్స్ లేక సినిమాలు హిట్ కాక టోటల్ మార్కెట్ కోల్పోయిన అల్లరి నరేష్ ఎప్పుడు కంబ్యాక్ ఇస్తాడా అంటూ అందరూ ఎదురు చూడగా ఆల్ మోస్ట్ 9 ఏళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు నాంది సినిమా తో క్లీన్ హిట్ ని సొంతం చేసుకున్నాడు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంది..3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని కంప్లీట్ చేసుకున్న నాంది సినిమా 9 ఏళ్ల నిరీక్షణకి తెరదించుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లరి నరేష్ కి నికార్సయిన కంబ్యాక్ మూవీ గా నిలిచి అటు పెర్ఫార్మెన్స్ పరంగా ఇటు కలెక్షన్స్ పరంగా జోరు చూపి ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలిచింది.

అల్లరి నరేష్ ఈ హిట్ ఓపెన్ గ్రౌండ్ లో కాకుండా 4 సినిమాల మధ్య పోటి లో, అప్పటికే హ్యుమంగస్ కలెక్షన్స్ తో రెచ్చిపోతున్న ఉప్పెన నుండి కూడా పోటి ని తట్టుకుని రోజు రోజు కి కలెక్షన్స్ పరంగా ఇంప్రూవ్ మెంట్ ని సొంతం చేసుకుని హిట్ అయింది. ఇక మీదట చేయబోయే సినిమాల పరంగా కూడా అల్లరోడు ఇలానే హిట్స్ కొడుతూ ఉండాలని మనం కోరుకుందాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here