Home న్యూస్ 2.75 రేటింగ్…నెగటివ్ షేర్…టాలీవుడ్ లో ఇదే ఫస్ట్ టైం!!

2.75 రేటింగ్…నెగటివ్ షేర్…టాలీవుడ్ లో ఇదే ఫస్ట్ టైం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రివ్యూలు పెద్దగా సినిమాల పై ఇంపాక్ట్ చూపవు, చాలా సినిమాలకు నెగటివ్ రివ్యూలు వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలు అనేకం ఉన్నాయి, అదే సమయంలో మంచి రివ్యూలు వస్తే అనుకున్న రేంజ్ కి మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలు ఉన్నాయి, కానీ చాలా తక్కువ సార్లే మంచి రివ్యూలు వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయిన సినిమాలు కొన్ని ఉంటాయి.

ఇప్పుడు ఆ కోవలోకే వెళుతుంది సుమంత్ నటించిన కపటధారి సినిమా, కన్నడ లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓపెనింగ్స్ నుండే కుమ్మేయకుండా… మంచి టాక్ తో కచ్చితంగా టాక్ తో పుంజుకుని కలెక్షన్స్ ని సాధిస్తుంది అని అంతా అనుకున్నారు.

కానీ సినిమా కి మరీ పాజిటివ్ రివ్యూలు రాలేదు, కానీ యావరేజ్ గా 2.75 రేంజ్ లో రేటింగ్ ను సొంతం చేసుకుని పర్వాలేదు బాగుంది అనిపించే టాక్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా, దాంతో ఓపెనింగ్స్ కాకుండా రోజు రోజుకి కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటుంది అనుకున్నారు.

కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందరికీ షాక్ ఇచ్చి దిమ్మతిరిగే డిసాస్టర్ గా నిలిచింది, మొదటి రోజే కొన్ని సెంటర్స్ లో డెఫిసిట్ లు పడగా అది తర్వాత కూడా కొనసాగి వర్కింగ్ డేస్ లో నెగటివ్ షేర్ తో పరుగును కొనసాగిస్తున్న ఈ సినిమా… టాలీవుడ్ లో పర్వాలేదు బాగుంది అన్న టాక్ ఉన్న నెగటివ్ షేర్ ని సొంతం చేసుకున్న అతి కొద్ది సినిమాలలో ఒకటిగా చేరి నిరాశ పరిచింది.

సినిమా మొత్తం మీద మొదటి రోజు 12 లక్షలు, రెండో రోజు 8 లక్షలు, మూడో రోజు 10 లక్షలు, నాలుగో రోజు 4 లక్షలు, 5 వ రోజు 2 లక్షల షేర్ ని అందుకుంది…వీకెండ్ లో డెఫిసిట్ లు సొంతం చేసుకున్న సినిమా వర్కింగ్ డేస్ లో నెగటివ్ షేర్స్ ని సాధించింది…దాంతో థియేటర్స్ నుండి చాలా వరకు తొలగించబడిన సినిమా మిగిలిన థియేటర్స్ లో పెర్సెంటేజ్ బేస్ తో రన్ అవుతుంది ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here