Home న్యూస్ గంభీర- ఇద్దరిలో ఒక తల మాత్రమే మిగులుతుంది అంటూ వార్నింగ్ ఇస్తున్న OG విలన్!

గంభీర- ఇద్దరిలో ఒక తల మాత్రమే మిగులుతుంది అంటూ వార్నింగ్ ఇస్తున్న OG విలన్!

0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న అప్ కమింగ్ మూవీస్ లో మోస్ట్ హైప్ ను సొంతం చేసుకున్న సినిమా సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్న OG – They Call Him OG….ఒక్క గ్లిమ్స్ తో సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోగా ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో ఆడియన్స్ ముందుకు ఈ సినిమా రాబోతుంది…

కాగా సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని అప్ డేట్స్ కూడా సాలిడ్ గా బజ్ ను క్రియేట్ చేశాయి….రీసెంట్ గా సినిమాలో విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హాష్మి(Emraan Hashmi) పుట్టిన రోజు కానుకగా సినిమా నుండి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు…కాగా ఆ పోస్టర్ కి ఇమ్రాన్ హాష్మి చేసిన కామెంట్ ఇప్పుడు…

సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది అని చెప్పాలి…”గంభీర- నువ్వు తిరిగి బాంబే వస్తున్నావని విన్నా….ప్రామిస్ మన ఇద్దరిలో ఒక తల మాత్రమే మిగులుతుంది” అంటూ వార్నింగ్ ఇస్తూ కామెంట్ చేశాడు….సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతుండగా 10 ఏళ్ల పాటు అన్నింటికీ దూరంగా ఉండే హీరో…

తిరిగి 10 ఏళ్లకి ముంబైలో అడుగు పెడతాడు…అప్పుడు విలన్ కి హీరో కి మధ్య ఏ రేంజ్ లో పోటి ఏర్పడింది, ఇద్దరిలో ఎవరు గెలిచారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ఫస్ట్ అప్ డేట్ నుండే ఊరమాస్ అంచనాలను క్యారీ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ ఎండ్ లో రిలీజ్ కానుంది… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here