Home న్యూస్ మలయాళ ఇండస్ట్రీ హిట్ తెలుగు డేట్ కన్ఫాం….బిజినెస్ ఎంతో తెలుసా!!

మలయాళ ఇండస్ట్రీ హిట్ తెలుగు డేట్ కన్ఫాం….బిజినెస్ ఎంతో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళంలో ఆల్ టైం ఎపిక్ ఇండస్ట్రీ రికార్డులతో దుమ్ము దుమారం లేపిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys) సినిమా అన్ని చోట్లా సెన్సేషనల్ రికార్డులతో దుమ్ము దుమారం లేపింది….210 కోట్లకు పైగా గ్రాస్ ను ఆల్ రెడీ అందుకున్న ఈ సినిమా…

ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ ఉండగా తమిళనాడులో ఏ మలయాళ మూవీ సాధించని రేంజ్ లో ఊచకోత కోసింది…. ఇక ఓవర్సీస్ లో సైతం దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా గురించి తెలుగు నాట కూడా కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ వర్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని…

అందరూ ఎదురు చూస్తున్న టైంలో ఎట్టకేలకు ఈ మలయాళ ఇండస్ట్రీ హిట్ తెలుగు డబ్ వర్షన్ రిలీజ్ డేట్ ను కన్ఫాం చేసుకుంది…. సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే నెలలో ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు మేకర్స్…

సినిమా తెలుగు రైట్స్ ను మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సొంతం చేసుకోగా ఓవరాల్ గా తెలుగు రైట్స్ ను 3 కోట్ల రేంజ్ రేటు కి సొంతం చేసుకున్నారని టాక్ ట్రేడ్ లో ఉంది. సినిమా ఈ రేటుని మంచి టాక్ ను సొంతం చేసుకుంటే అవలీలగా అందుకోవడమే కాదు సాలిడ్ గా లాభాలను సైతం సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here