బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కాలంగా హిట్స్ కి దూరం అయిన హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ అనుకోకుండా లేట్ అవుతూ వచ్చిన ఈ సినిమా సడెన్ గా రిలీజ్ ను కన్ఫాం చేసుకుని ప్రమోషన్స్ కి పెద్దగా టైం లేక పోయినా కానీ చక చకా ఉన్న టైం లోనే ప్రమోషన్స్ ని జరుపుకుని మౌత్ టాక్ పై నమ్మకంతో…
ఆడియన్స్ ముందుకు రానే వచ్చింది. కాగా సినిమా మరీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా కాక పోవడం, శర్వానంద్ కూడా ఫ్లాఫ్స్ లో ఉండటంతో ఓవరాల్ గా బిజినెస్ మాత్రం టాలీవుడ్ ట్రేడ్ లెక్కల ప్రకారం రీజనబుల్ గానే జరిగింది అని చెప్పాలి ఇప్పుడు….
ముందుగా సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ లెక్కలను గమనిస్తే…
👉Nizam – 120
👉Ceeded – 60
👉Andhra – 200~
AP TG:- 380+
👉Remaining – 200~
Total WW – 580+
ఇదీ సినిమా టోటల్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ లెక్క… ఇక సినిమా టాలీవుడ్ ట్రేడ్ లెక్కల ప్రకారం సొంతం చేసుకున్న టోటల్ బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
Nizam: 2.5Cr
Ceded: 0.8Cr
Andhra: 3.20Cr
AP-TG Total: 6.50Cr
Tamil+Ka+ROI+OS: 1.00Cr
Worldwide: 7.5CR(Break Even – 8cr)
ఇదీ మొత్తం మీద సినిమా ఓవరాల్ గా సాధించిన వాల్యుడ్ బిజినెస్ లెక్క. కాగా ఇప్పుడు సినిమా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమమ్ 8 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా….
సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, ప్రీవియస్ శర్వానంద్ మూవీస్ తో పోల్చితే చాలా రీజనబుల్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటే కలెక్షన్స్ పరంగా ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి ఇప్పుడు.