Home న్యూస్ ఊరుపేరు భైరవకోన రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

ఊరుపేరు భైరవకోన రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie Telugu Review) ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం భారీ లెవల్ లో వచ్చేసింది. ఈ సినిమా మీద సందీప్ కిషన్ భారీ ఆశలు అంచనాలు పెట్టుకాగా సినిమా మొత్తం మీద ఆడియన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టొరీ పాయింట్ కి వస్తే సినిమాల్లో స్టంట్ మ్యాన్ గా పని చేసే హీరో పని చేస్తూ ఉంటాడు, తన బాబాయ్ కోసం ఒక చిన్న తప్పు చేయాల్సి వస్తుంది, ఆ తప్పు తనని గరుడ పురాణంకి లింక్ అయిన భైరవకోన కి వెళ్ళేలా చేస్తుంది, ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…. ఓవరాల్ గా కథ పాయింట్ కొంచం కొత్తగా ఆకట్టుకునేలా ఉంది…..

పెర్ఫార్మెన్స్ పరంగా సందీప్ కిషన్ మంచి ఎనర్జీతో తన రోల్ కి ఫుల్ న్యాయం చేశాడు, హీరోయిజం సీన్స్ లో కూడా అదరగొట్టాడు, హీరోయిన్స్ ఇద్దరూ తమ తమ రోల్స్ లో మెప్పించగా మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా తమ తమ రోల్స్ లో బాగానే నటించి మెప్పించారు అని చెప్పాలి. సంగీతం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్…. ఉన్న 2 సాంగ్స్ బాగా ప్లస్ అవ్వగా….

బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా సీన్స్ ను ఎలివేట్ చేసింది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు బాగుంది కానీ సెకెండ్ ఆఫ్ కి వచ్చే సరికి మాత్రం ట్రాక్ తప్పింది అని చెప్పాలి. పడుతూ లేస్తూ, కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తూ సెకెండ్ ఆఫ్ కొంచం ఎక్కువగా డ్రాగ్ అయింది… సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉండగా విజువల్స్ అన్నీ చాలా రిచ్ గా కనిపించాయి…

ఇక ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్చ్ అనిపించేలా ఉండగా డైరెక్షన్ విషయానికి వస్తే VI ఆనంద్ మంచి పాయింట్ ను తీసుకుని దానికి హర్రర్, మిస్టరీ అండ్ కామెడీ టచ్ ను కలిపి ఓవరాల్ గా డీసెంట్ ప్రాడక్ట్ ను తీసుకు వచ్చాడు కానీ సెకెండ్ ఆఫ్ ను మరింత బాగా డీల్ చేసి ఉంటే బాగుండేది… 

సినిమాలో కొన్ని మిస్టరీ ఎలిమెంట్స్, హీరో పెర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్ అలాగే డీసెంట్ ఫస్టాఫ్, 2 సూపర్బ్ సాంగ్స్ మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే…సెకెండ్ ఆఫ్ డ్రాగ్ అవ్వడం, కొన్ని చోట్ల డ్రాగ్ అయ్యి ట్రాక్ తప్పడం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్ అని చెప్పాలి. అయినా కానీ టీం చేసిన ప్రయత్నం చాలా వరకు బాగుండటం…

పార్టు పార్టులుగా చాలా వరకు ఎంజేగింగ్ గా ఉండటం, కొత్త జానర్ మూవీ అవ్వడంతో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా సినిమా ఈజీగా ఒకసారి చూసేలా ఉందని చెప్పాలి. పెద్దగా అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ కి సినిమా చాలా వరకు పర్వాలేదు బాగుంది అనిపించేలా ఉంటుంది. విరూపాక్ష లాంటి సాలిడ్ థ్రిల్లర్ ను ఎక్స్ పెర్ట్ చేసి వెళితే జస్ట్ ఓకే అనిపించేలా ఉంటుంది. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here