Home న్యూస్ ఆపరేషన్ వాలంటైన్ ట్రైలర్ రివ్యూ…..బాగుంది ట్రైలర్….కానీ!!

ఆపరేషన్ వాలంటైన్ ట్రైలర్ రివ్యూ…..బాగుంది ట్రైలర్….కానీ!!

0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) మూవీ ఆడియన్స్ ముందుకు మార్చ్ 1 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను తెలుగు లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) చేత అలాగే హిందీలో…

సల్మాన్ ఖాన్(Salman Khan) చేత రిలీజ్ చేశారు… ట్రైలర్ క్వాలిటీ పరంగా టాప్ నాట్చ్ విజువల్స్ తో సాలిడ్ గానే మెప్పించింది…ఫైటర్ జెట్ నడిపే హీరో 2019 టైంలో ఇండియా పై పాకిస్థాన్ చేసిన దాడుల నేపధ్యంలో స్పెషల్ ఫోర్స్ తో ఎలా ఎయిర్ ఫైట్ చేశాడు అన్న కాన్సెప్ట్ తో ఆపరేషన్ వాలంటైన్ సినిమా ఉండబోతుందని అనిపిస్తుంది…

వరుణ్ తేజ్ డిఫెరెంట్ రోల్ లో బాగానే మెప్పించేటట్లు అనిపిస్తూ ఉండగా విజువల్స్ అండ్ గ్రాండియర్ సాలిడ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. ఎయిర్ ఫైట్స్ ఉండే సినిమా అవ్వడంతో క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని ట్రైలర్ చూస్తే అనిపిస్తూ ఉండగా ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఉంది.

ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ ప్రస్తుతం ఔట్ డేడెడ్ అయిపోయాయి. ఇండియా Vs పాకిస్థాన్ గొడవలు, ఎయిర్ ఫోర్స్ నేపధ్యంలో సినిమాలు పెద్దగా ఇండియాలో అయితే చూడటం లేదు, రీసెంట్ గా వచ్చిన బాలీవుడ్ మూవీస్ టైగర్3 మరియు ఫైటర్ సినిమాల రిజల్ట్స్ మొత్తం మీద అంచనాలను అందుకోలేదు…

అందునా ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ తెలుగు లో రావడం కూడా చాలా అరుదు కాబట్టి జనాలు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నదానిపై సినిమా విజవకాశాలు ఆధారపడి ఉంటాయి అని చెప్పాలి. మొత్తం మీద ట్రైలర్ వరకు అయితే బాగానే మెప్పించగా మార్చ్ 1న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంతవరకు జోరు చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here