Home న్యూస్ ఆపరేషన్ వాలెంటైన్ టోటల్ బిజినెస్…..హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలంటే!

ఆపరేషన్ వాలెంటైన్ టోటల్ బిజినెస్…..హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలంటే!

0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) రీసెంట్ టైంలో పెద్దగా ఫామ్ లో లేని విషయం అందరికీ తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన సినిమా చేసినట్లు నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంటున్న తరుణంలో ఇప్పుడు మరో ఎక్స్ పెరిమెంటల్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) తో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉన్నాడు…

ఈ సినిమా జానర్ తెలుగు ఆడియన్స్ కి కొత్త అవ్వడంతో ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఆసక్తిగా మారగా సినిమా కోసం చాలా కష్టపడిన వరుణ్ తేజ్ ప్రమోషన్స్ పరంగా కూడా అన్ని చోట్లకు వెళ్లి సినిమాను ఎంతవరకు కుదిరితే అంత ప్రమోట్ చేశాడు…. ఇక సినిమా ఓవరాల్ గా ఎంతవరకు బిజినెస్ జరిగింది అన్నది…

ఆసక్తిగా మారగా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఆల్ మోస్ట్ 46 కోట్లకు పైగా రికవరీ సొంతం చేసుకుందని అంటున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ రేంజ్ 10 కోట్ల దాకా ఉంటుందని అంచనా… ఒకసారి సినిమా మేజర్ ఏరియాల బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

Operation Valentine WW Pre Release Business(Valued)(Updated)
👉Nizam: 3Cr
👉Ceeded: 1Cr
👉Andhra: 4Cr(Valued)
AP-TG Total:- 8.00CR
👉KA+ROI+OS – 2Cr
Total WW: 10CR(BREAK EVEN – 11CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్యూ బిజినెస్ రేంజ్ 10 కోట్ల దాకా ఉంటుందని అంచనా… ఈ లెక్కన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ఓవరాల్ గా 11 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here