Home న్యూస్ ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine Telugu Review And Rating) సినిమా సాలిడ్ గా ప్రమోషన్స్ ను జరుపుకుని ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. వరుస ఫ్లాఫ్స్ తో స్లో అయిన వరుణ్ తేజ్ ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తానని నమ్మకంగా ఉన్నాడు. మరి సినిమా అంచనాలను ఎంతవరకు అందుకుందో తెలుసుకుందాం పదండీ..

ముందుగా స్టోరీ పాయింట్ కి వస్తే…ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్ అయిన హీరో కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది…. ఎయిర్ క్రాఫ్ట్ ను టెస్ట్ చేయడంలో స్పెషలిస్ట్…అలా టెస్ట్ చేస్తున్న టైంలో పుల్వామా అటాక్ జరుగుతుంది… దాంతో తర్వాత హీరో ఏం చేశాడు తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… పుల్వామా అటాక్స్ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి….

పాశవికంగా జరిగిన ఆ ధాడిని ఎవ్వరూ మర్చిపోలేరు…ఆ తర్వాత ఇండియా రివెంజ్ ను కూడా ఎవ్వరూ మర్చిపోలేరు…అలాంటి రియల్ కథని ఆల్ రెడీ ఇతర సినిమాలలో చూపించగా మళ్ళీ అలాంటి ఫీలింగ్స్ ఆడియన్స్ కి కలగాలి అంటే సినిమాలో ఎదో ఒక స్పెషాలిటీ ఉండాలి… కానీ ఆపరేషన్ వాలంటైన్ సినిమాలో అవే కొరబడ్డాయి…

ఒక్క ఇంటర్వెల్ సీన్ మినహా మిగిలిన సినిమా చాలా వరకు ఫ్లాట్ గా సాగిపోయింది. ఎమోషనల్ గా ఆడియన్స్ ఫీల్ అయ్యే సీన్స్ కూడా చాలా తక్కువ…. ఉన్నంతలో వరుణ్ తేజ్ తన రోల్ వరకు ఎంత న్యాయం చేయాలో అంత చేశాడు కానీ కథలోనే దమ్ము లేక పోవడంతో తన శ్రమ వృధా అయ్యింది… దానికి తోడూ ఇలాంటి రియల్ స్టొరీలకు…

పాత్రలకు ఎలివేషన్స్ పెడితే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు కానీ హీరోకే ఎలివేషన్ లు పెడితే కొన్ని సీన్స్ కి ఓకే కానీ అవే రిపీట్ అయితే ఆడియన్స్ కి కూడా నచ్చదు… ఆపరేషన్ వాలంటైన్ లో కూడా ఇదే జరిగింది…. హీరోయిన్ ఉన్నంతలో పర్వాలేదు అనిపించగా ఇద్దరి లవ్ స్టొరీ జస్ట్ ఓకే అనిపించేలా ఉంటుంది. మిగిలిన యాక్టర్స్ కి స్కోప్ తక్కువ…

సంగీతం జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉండగా కొన్ని సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది…ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు పడుతూ లేస్తూ సాగినా పర్వాలేదు అనిపించగా సెకెండ్ ఆఫ్ మాత్రం డ్రాగ్ అయ్యాయి. కొందరి డబ్బింగ్ కూడా లిప్ సింక్ లేకుండా ఉంటుంది….కొన్ని చోట్ల గ్రాఫిక్స్ వర్క్ కూడా వీడియో గేమ్స్ లా అనిపించింది….. 

ఉన్నంతలో ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపించగా డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ ఆల్ రెడీ జనాలు చూసి ఉన్నారు, మళ్ళీ సేమ్ పాయింట్ ని కొంచం అటూ ఇటూగా కథని మార్చి తీసినా అది పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు… ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ చాలా బెటర్ గా తీయాల్సి ఉండగా అక్కడే డ్రాగ్ అయ్యి అంచనాలను తప్పింది సినిమా…

మొత్తం మీద వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్ లాంటివి ప్లస్ పాయింట్స్ అయితే, ఎమోషన్స్ వర్కౌట్ అవ్వకపోవడం, సెకెండ్ ఆఫ్ డ్రాగ్ అవ్వడం, గ్రాఫిక్స్ వర్క్ పూర్ గా ఉండటం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్…. ఉన్నంతలో టీం చేసిన ప్రయత్నానికి కొంచం ఓపిక తెచ్చుకుని కూర్చుని చూస్తె ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here