అమ్మింది 22.8 కోట్లకి…3 రోజుల్లో వచ్చింది ఇది….పాపం శర్వానంద్

0
361

  గత ఏడాది రెండు హిట్లు ఒక ఫ్లాఫ్ తో మంచి జోరు కొనసాగించిన యంగ్ హీరో శర్వానంద్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు పడి పడి లేచే మనసు అంటూ కొత్త సినిమా తో వచ్చేశాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 5 సినిమాలలో ఒకటిగా నిలిచి పోటిలో గెలుస్తుంది అనుకున్న ఈ సినిమా మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ మాత్రం షాకింగ్ గా ఉన్నాయి. సినిమాను టోటల్ గా 22.8 కోట్లకు అమ్మారు.

దాంతో బాక్స్ అఫీస్ దగ్గర మినిమమ్ 23.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి 3 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 4.3 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలిపి మరో 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా,

మొదటి వీకెండ్ మొత్తం మీద షేర్ 5 కోట్ల మార్క్ ని అందుకుంది. అంటే బ్రేక్ ఈవెన్ కి సినిమా మరో 18 కోట్లు వసూల్ చేయాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యమే అవ్వడం బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ ఖాతాలో ఫ్లాఫ్ పడటం పక్కగా మారింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here