టార్గెట్ 200 కోట్లు…3 రోజుల్లో వచ్చింది ఇది….పాపం షారుఖ్!!

0
284

  ఒకప్పుడు వరుస విజయాలతో బాలీవుడ్ అంటే షారుఖ్…షారుఖ్ అంటే బాలీవుడ్ గా పేరు తెచ్చుకున్న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గత కొన్నేళ్ళు గా సరైన విజయం లేక సినిమా సినిమా కి తన రేంజ్ ని దించుకుంటున్నాడు. దాదాపు 200 కోట్లతో రీసెంట్ గా జీరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారుఖ్ కి ఫస్టాఫ్ అల్టిమేట్ రెస్పాన్స్ దక్కినా సెకెండ్ ఆఫ్ పూర్తిగా దెబ్బ కొట్టడం తో రిజల్ట్ తేడా గా వచ్చింది.

సినిమా మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేసింది. జీరో ని ఇండియా లో టోటల్ గా 100 కోట్ల నుండి 105 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా 200 కోట్ల నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగగా తొలిరోజు 20.21 కోట్లు, రెండో రోజు 18.71 కోట్లు, మూడో రోజు 20.7 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంది.

టోటల్ గా మూడు రోజుల కలెక్షన్స్ 60 కోట్ల మార్క్ ని కూడా అందుకోలేక పోయింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కూడా కేవలం 110 కోట్ల రేంజ్ లో ఉండటం తో మరోసారి షారుఖ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ షాక్ తగిలినట్లు అయింది. మరి వర్కింగ్ డేస్ లో అయినా సినిమా జోరు చూపుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here