Home న్యూస్ “ప్రతీరోజూ పండగే” రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

“ప్రతీరోజూ పండగే” రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

     మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ వరుస డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్స్ తర్వాత చిత్రలహరి తో కంబ్యాక్ ఇచ్చాడు, ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు “ప్రతీరోజూ పండగే” అంటూ మారుతి డైరెక్షన్ లో చేసిన సినిమాతో వచ్చేశాడు, మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది, ప్రేక్షకుల మనసు గెలిచిందా లేదా తెలుసుకుందాం పదండీ..

కథ విషయానికి వస్తే బిజినెస్ ఎక్స్ పాన్షన్ కోసం హీరో పెళ్లి ఫిక్స్ చేస్తాడు హీరో తండ్రి. ఈ లోపు తన తాతయ్య లంగ్ కాన్సర్ తో నెల రోజుల్లో చనిపోతున్నాడు అని తెలుసుకున్న హీరో తాత దగ్గరికి వచ్చి కుటుంబం మొత్తాన్ని తాత కోసం ఎలా కలిపాడు, తాను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అన్నది అసలు కథ.

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సాయి ధరం తేజ్ తన సీన్స్ అన్నింటి లో తన మార్క్ చూపెట్టి మెప్పించాడు, డాన్సులు ఫైట్స్ లో ఆకట్టుకున్నాడు, నటన పరంగా మరింత మెరుగు అవుతున్నాడు, ఇక సత్యరాజ్, రావ్ రమేష్ ల రోల్స్ బాగున్నాయి, రాశిఖన్నా కామిక్ టైమింగ్ తో అలాగే పల్లెటూరి అమ్మాయి రోల్ లో చాలా చక్కగా ఉంది.

మిగిలిన రోల్స్ చేసిన నటులు ఉన్నంతలో ఆకట్టుకోగా తమన్ అందించిన సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి తగ్గట్లు మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ తో మెప్పించాడు, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే నీరసంగా ఉంటుంది, సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

ఇక డైరెక్షన్ పరంగా రొటీన్ కథని ఎంచుకుని దానికి కామిడీ డోస్ తగిలించి మెప్పించాలని ట్రై చేశాడు మారుతి, ఆ విషయం లో చాలా సీన్స్ లో సక్సెస్ అయ్యాడు కూడా… కానీ ఎంత కామెడీ కోసం అనుకున్నా తండ్రి చనిపోతాడు అని తెలిసిన ఏ కొడుకు కూడా తండ్రి మీద లేకి కామెడీలు చేయడు.. కానీ సినిమాలో చేస్తాడు. ఆ విషయం లో మాత్రం మారుతి ఎంత సినిమా కోసం చేసినా రియాలిటీకి చాలా దూరంగా ఉంటుంది ఇలాంటి సీన్స్.

కథ పరంగా శతమానం భవతి, మరి కొన్ని ఇతర సినిమాల నుండి స్పూర్తి పొంది రాసుకున్న ఈ కథ చాలా వరకు చూస్తున్న సమయం లో ఆ సినిమాలనే గుర్తు చేస్తుంది, కానీ అక్కడక్కడా కామెడీ బాగుండటం, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకోవడం తో స్లో గా బాగానే ఉంది అన్న ఫీలింగ్ కలిగిస్తుంది.

మొత్తం మీద హైలెట్స్ విషయానికి వస్తే, సత్యరాజ్, రావ్ రమేష్, సాయి ధరం తేజ్, రాశిఖన్నా ల పెర్ఫార్మెన్స్, కొన్ని కామెడీ సీన్స్, తమన్ సంగీతం, కొన్ని ఎమోషనల్ సీన్స్ హైలెట్స్ గా నిలిచాయి. ఇక మైనస్ ల విషయానికి వస్తే రొటీన్ కథ, ఫ్లాట్ స్లో నరేషన్, వీక్ డైరెక్షన్ మైనస్ లు అని చెప్పాలి..

మొత్తం మీద సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతో కొంత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది, దాంతో ఓవరాల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ [2.75 స్టార్స్]… రెగ్యులర్ ఆడియన్స్ అండ్ మాస్ ఆడియన్స్ మూవీ ని ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అన్న దానిపై సినిమా విజయావకాశాలు ఆధార పడి ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here