Home న్యూస్ లవ్ స్టొరీ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

లవ్ స్టొరీ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ ఆడియన్స్ ముందుకు ఎట్టకేలకు భారీ అంచనాల నడుమ వచ్చేసింది. సమ్మర్ రేసులో నిలిచిన ఈ సినిమా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ తో పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేయగా ముందుగా ఓవర్సీస్ లో నాగ చైతన్య కెరీర్ లో రికార్డ్ లెవల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కి…

అక్కడ నుండి ప్రీమియర్స్ షో ల తర్వాత వినిపిస్తున్న ఫస్ట్ టాక్ పాజిటివ్ గా ఉందని చెప్పాలి. సినిమా కి అక్కడ సెకెండ్ వేవ్ తర్వాత ది బెస్ట్ అనిపించుకునే రేంజ్ లో ఆక్యుపెన్సీ సొంతం అవ్వగా సినిమా ప్రీమియర్ షో నుండి ఫస్ట్ టాక్ ఇలా ఉంది…

హీరో హీరోయిన్స్ ఇద్దరూ లైఫ్ లో స్ట్రగుల్ అవుతూ ఉన్న టైం లో కలవడం హీరోయిన్ డాన్స్ నచ్చి తన గ్రూప్ లో చేరమని హీరో చెప్పడం తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ, ఈ విషయం తెలిసిన హీరోయిన్ ఫ్యామిలీ వాళ్ళు నో చెప్పడం తర్వాత వీళ్ళు లైఫ్ లో ఫేస్ చేసిన ప్రాబ్లంస్ ని…

ఎలా సాల్వ్ చేసుకున్నారు అన్నది సినిమా కథ… .ఫస్టాఫ్ వరకు సరదా సరదాగా సాగే సీన్స్ తో హీరో హీరోయిన్స్ పరిచయం, ప్రేమ ని చూపెట్టగా సారంగధరియా సాంగ్ తో అంచనాలను అందుకునే రేంజ్ లో ఉండగా ఇంటర్వెల్ నుండి సినిమా సెకెండ్ ఆఫ్ పై ఆసక్తిని పెంచి… సెకెండ్ ఆఫ్ లో కొంచం మెలో డ్రామా ఎక్కువ అయినా కానీ…

ఓవరాల్ గా ఓ మంచి సినిమా చూశాం అన్న ఫీలింగ్ తో ఆడియన్స్ బయటికి వస్తారని అంటున్నారు. ఫస్టాఫ్ బాగుందని, సెకెండ్ ఆఫ్ కొంచం లెంత్ అండ్ ఎమోషనల్ పార్ట్ ఎక్కువ అయినా అది కూడా హార్ట్ టచింగ్ గా ఉందని, ఓవరాల్ గా హిట్ మూవీ అని అంటున్నారు. ఇక ఇదే రేంజ్ టాక్ ని ఇక్కడ సినిమా రెగ్యులర్ షోలకు సొంతం చేసుకుంటే ఇక రచ్చ ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here