Home న్యూస్ అక్కడ హైయెస్ట్ లెక్క 2CR….ఇప్పుడు ఒక్క రోజులో 2 కోట్లతో ఈ సినిమా ఎపిక్ రికార్డ్!

అక్కడ హైయెస్ట్ లెక్క 2CR….ఇప్పుడు ఒక్క రోజులో 2 కోట్లతో ఈ సినిమా ఎపిక్ రికార్డ్!

0

ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలలో మలయాళ ఇండస్ట్రీ నుండి వరుస పెట్టి సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ ఉండగా వాటిలో రీసెంట్ గా రిలీజ్ అయిన మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys) మూవీ మాత్రం మరో లెవల్ లో రాంపెజ్ ను చూపిస్తూ 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా…

సినిమా కేరళలో ఒక పక్క దుమ్ము లేపుతూ ఉండగా మరో పక్క పక్క రాష్ట్రం తమిళనాడులో మరో లెవల్ లో జోరు చూపిస్తూ ఏ మలయాళ సినిమా సాధించని రికార్డులను నమోదు చేస్తుంది…. ఓవరాల్ గా మలయాళ మూవీస్ పరంగా తమిళనాడులో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా గా…

ప్రేమమ్ మూవీ 2 కోట్లతో అప్పట్లో సంచలనం సృష్టించగా రీసెంట్ గా ఈ కలెక్షన్స్ ని బ్రేక్ చేసిన మంజుమ్మేల్ బాయ్స్  మూవీ ఇప్పుడు రెండో శుక్రవారం వర్కింగ్ డే లో అక్కడ చరిత్ర సృష్టించింది….ఏకంగా 2 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని ఒక్క రోజులోనే తమిళనాడులో అందుకుని సంచలనం సృష్టించింది…

అదే టైంలో కేరళలో సినిమా రెండో శుక్రవారం 1.85 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటే తమిళనాడులో ఏకంగా 2 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని సంచలన రికార్డ్ ను అందుకోగా ఈ వీకెండ్ లో అక్కడ ఎపిక్ కలెక్షన్స్ తో 3 కోట్ల మార్క్ ని కూడా సింగిల్ డే లో అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు…. 

లాంగ్ రన్ లో ఏ మలయాళ సినిమా కూడా సాధించని విధంగా ఇప్పటి వరకు కలెక్షన్స్ తో 5 కోట్ల గ్రాస్ ను అందుకోగా టోటల్ రన్ లో బిగ్గెస్ట్ రికార్డ్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ వైపు వరల్డ్ వైడ్ గా దూసుకు పోతుంది సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here