తమిళ ఆడియన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సెన్సేషనల్ మూవీ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా తమిళనాడులో ఎక్స్ లెంట్ బజ్ అయితే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు, అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ అదిరి పోయే రేంజ్ లో కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా మిగిలిన చోట్ల మాత్రం సినిమా బుకింగ్స్ ఇప్పుడిప్పుడే జోరు అందుకుంటూ ఉండగా…
ఓవరాల్ గా బజ్ కూడా మరీ అనుకున్న రేంజ్ లో అయితే సొంతం చేసుకోలేదు అనే చెప్పాలి. తమిళనాడు తప్పితే మిగిలిన చోట్ల సినిమా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి ఇప్పుడు రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది.
ఇక తెలుగులో సినిమాను రిలీజ్ చేస్తున్న దిల్ రాజు ఇక్కడ సినిమా కి ఓ రేంజ్ లో బజ్ ఉంది అనుకుని టికెట్ హైక్స్ బిగ్ స్టార్ హీరోలకు ఏ విధంగా ఉంటుందో ఆ రేటు ని ఫిక్స్ చేశాడు. మల్టిప్లెక్సులలో ఈ సినిమా టికెట్ రేటు 295 గా ఉండగా సింగిల్ స్క్రీన్స్ లో…
మొత్తం మీద 175 టికెట్ రేటు ని ఫిక్స్ చేశారు. ఇక ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజుతో కలిపి ఈ రేటు ఇంకా ఎక్కువే ఉంటుంది, మరి జనాలు ఈ రేంజ్ రేటు చెల్లించడానికి సిద్ధం అవుతారా లేదా అన్నది సినిమాకి వచ్చే టాక్ మీద ఆధారపడి ఉంటుంది, టాక్ కనుక ఎక్స్ లెంట్ గా సొంతం చేసుకుంటే ఈ రేటు పెట్టడానికి జనాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది…. కానే అదే టైం లో…
టాక్ కొంచం తేడా కొట్టినా కానీ ఇదే సినిమాకి భారీగా బాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. మరి సినిమా కి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుంది, తమిళనాడులో ఎలాంటి ఓపెనింగ్స్ తో సినిమా రచ్చ చేస్తుంది అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.