Home న్యూస్ పుష్పకి అంతా అరాచకమే కానీ…ఈ సినిమానే దెబ్బ కొడుతుంది!

పుష్పకి అంతా అరాచకమే కానీ…ఈ సినిమానే దెబ్బ కొడుతుంది!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ పుష్ప, పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సెన్సేషనల్ మూవీ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా సినిమా లో అల్లు అర్జున్ ఇంట్రో టీసర్ ఆల్ టైం రికార్డ్ వ్యూస్ అండ్ లైక్స్ తో సంచలనం సృష్టించగా సాంగ్స్ కి అద్బుతమైన రీచ్ అండ్ క్రేజ్ సొంతం అయ్యింది…

ఓవరాల్ గా ఇప్పటి వరకు పుష్ప నుండి వచ్చిన అప్ డేట్స్ అన్నీ కూడా సినిమా పై అంచనాలను పెంచుతూ ఆడియన్స్ ఓ రేంజ్ లో సినిమా చూడాలి అన్న ఆసక్తిని క్రియేట్ అయ్యేలా చేసింది…. సినిమా పై అరాచకమైన అంచనాలు కూడా ఉన్నాయి అందరిలోనూ…

   

అలాంటి ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో డిసెంబర్ 17 న రికార్డ్ లెవల్ లో రిలీజ్ అవ్వడం ఖాయం కాగా ఇతర ఇండస్ట్రీలలో కూడా మంచి రిలీజ్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఇదే సమయంలో సినిమా కి ఇండియన్ సినిమాల నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పోటి అయితే లేదు కానీ…

పోటి గా ఉండే అవకాశం ఉన్న ఒకే ఒక్క సినిమాగా స్పైడర్ మాన్ నో వే హోమ్ అనే చెప్పాలి… ఇండియాలో హాలీవుడ్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ హైప్ ను రీసెంట్ టైం లో సొంతం చేసుకున్న సినిమాగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు ఇప్పుడు… అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత ఇండియాలో భారీ హైప్ ఈ సినిమాకి ఉండగా ఓవర్సీస్ లో క్రేజ్ మరో లెవల్ లో ఉంది….

ఈ ఇంపాక్ట్ కచ్చితంగా పుష్ప ఓవర్సీస్ రిలీజ్ అలాగే ఇండియాలో నార్త్ సైడ్ రిలీజ్ పై ఇంపాక్ట్ చూపే ఛాన్స్ ఎంతైనా ఉంది. ఓవర్సీస్ లో ఆల్ మోస్ట్ 90% స్క్రీన్స్ లో స్పైడర్ మాన్ రిలీజ్ కన్ఫాం అవ్వగా పుష్ప కి చాలా లిమిటెడ్ రిలీజ్ దక్కబోతుందట. ఇండియాలో కూడా 3500 స్క్రీన్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. దాంతో పుష్ప స్క్రీన్స్ పై ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది, అది ఎంతవరకు ఉంటుంది అన్నది రిలీజ్ టైం కి చెప్పగలం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here