అల వైకుంఠ పురం లో ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డులతో హోరెత్తించి సరికొత్త నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే, ఇక ఈ సినిమా తో రెట్టించిన జోష్ తో ఏకంగా పాన్ ఇండియా మూవీ నే ప్లాన్ చేశాడు అల్లు అర్జున్. రంగస్థలం తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప అనే డిఫెరెంట్ టైటిల్ తో పాన్ ఇండియా మూవీ ని…
తన పుట్టిన రోజున అనౌన్స్ చేశాడు. ఇక సినిమా ఈ ఇయర్ లోనే వస్తుందని ఈ ఇయర్ మొదట్లో టాక్ వచ్చినప్పటికీ వచ్చే ఇయర్ సమ్మర్ కానుకగా వస్తుందని అందరూ అనుకున్నారు, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళాలి అంటేనే…
మరింత సమయం తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది, దానికి కారణం ఇది పాన్ ఇండియా మూవీ అవ్వడం తో ఇతర ఇండస్ట్రీ ల నటీనటులు షూటింగ్ కి రావాల్సి ఉంటుంది, ఇది రెగ్యులర్ మూవీ అయితే ఎక్కడో చోట షూట్ చేసే వాళ్ళు కానీ సినిమా కాన్సెప్ట్ దృశ్యా…
ఎక్కువ శాతం షూటింగ్ అడవి లో ఉంటుందట, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో క్రూ అండ్ స్టార్ కాస్ట్ అంతా అడవుల చుట్టూ తిరిగి షూట్ చేయడం అన్నది కష్టం అని చెప్పొచ్చు, సుకుమార్ సెట్ వేసి తీద్దాం అని ప్లాన్ చేస్తున్నా నాచురాలిటీ ఉండాలని కొంచం వెనకడుగు వేస్తున్నాడట. అల్లు అర్జున్ కూడా ఆలస్యం అయినా పర్వాలేదు… మనం అనుకున్నట్లే సినిమా తీయాలని…
దానికి మరింత సమయం ఎదురు చూడాల్సి వచ్చినా ఆగుదామని చెప్పాడట. దాంతో సినిమా ఇప్పట్లో రెగ్యులర్ షూట్ జరుపుకోవడం కష్టమే అని అంటున్నారు. పాన్ ఇండియా మూవీ అవ్వడం తో వచ్చే ఇయర్ సమ్మర్ టైం కి సినిమా రావడం కూడా కష్టం అయ్యే అవకాశమే ఎక్కువగా ఉందని అంటున్నారు..