పాన్ ఇండియా సెన్సేషన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుండగా రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకోగా 2 గంటల 18 నిమిషాల రన్ టైం తో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. సినిమా పై ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఉండగా….
సినిమా సెన్సార్ వారి నుండి ఫస్ట్ టాక్ ఎలా ఉంది అన్నది ఆసక్తిగా మారగా సెన్సార్ నుండి సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ వినిపిస్తుంది అని చెప్పాలి. మనిషి చేయి చూసి ఫ్యూచర్ ని వాయిస్ విని పాస్ట్ ని కూడా చెప్పగలిగే పామిస్ట్ అయిన హీరో…
తన ప్రేమ కోసం కాలంతో ఎలాంటి యుద్ధం చేశాడు, చివరికి గెలిచాడా లేదా అన్న డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలో విజువల్స్, గ్రాండియర్, సోల్ ఫుల్ మ్యూజిక్, ప్రభాస్ పూజా ల కెమిస్ట్రీ అన్నింటికీ మించి సినిమా క్లైమాక్స్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు….
పెర్ఫెక్ట్ రన్ టైం తో తెరకెక్కిన ఈ సినిమా కొంచం కథ స్టార్ట్ అవ్వడం కొద్దిగా టైం తీసుకున్నట్లు అనిపించినా తర్వాత మాత్రం సీన్ బై సీన్ తర్వాత ఏమవుతుందా అన్న ఆసక్తి ని చివరి వరకు మెయిన్ టైన్ చేసి మెప్పించేలా ఎండ్ అవుతుందని అంటున్నారు. మొత్తం మీద సినిమా కి సెన్సార్ వాళ్ళ నుండి ఫైనల్ టాక్ మాత్రం హిట్ నుండి సూపర్ హిట్ రేంజ్ కి…
ఏమాత్రం తీసి పోనీ విధంగా ఉంటుంది అని అంటున్నారు…. రీసెంట్ టైం లో చాలా సినిమాలకు ఎబో యావరేజ్ టు హిట్ రేంజ్ టాక్ వినిపించినా ఈ సినిమా విషయంలో హిట్ నుండి సూపర్ హిట్ అనిపించే రేంజ్ టాక్ వినిపిస్తూ ఉండటం తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక ఇదే నిజం అయితే ఇక బాక్స్ ఆఫీస్ ను ప్రభాస్ చెడుగుడు ఆడేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు.