యంగ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ రాజా విక్రమార్క… RX100 తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టాలని ట్రై చేస్తున్న కార్తికేయకి కొన్ని పర్వాలేదు అనిపించే సినిమాలు పడ్డా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేదు, ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాజా విక్రమార్క సినిమా తో వచ్చిన కార్తికేయ ఎంతవరకు ఆకట్టుకున్నాడు లాంటి విశేషాలను తెలుసు కుందాం పదండీ… ముందుగా సినిమా కథ పాయింట్ కి వస్తే…
NIA టీం ఒక టెర్రరిస్ట్ ను పట్టుకోగా స్టేట్ హోమ్ మినిస్టర్ కి థ్రెట్ ఉందని తెలుస్తుంది, దాంతో కార్తికేయని అండర్ కవర్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమించి ఈ థ్రెట్ ని ఆపే భాద్యతని అప్పగించగా తర్వాత ఈ ప్రాసెస్ లో హోమ్ మినిస్టర్ కూతురు….
అయిన హీరోయిన్ తో లవ్ పడిన హీరో ఆ థ్రెట్ ని ఎలా ఆపాడు, ఆపిన తర్వాత కథ ఎలా టర్న్ తీసుకుంది లాంటివి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… పెర్ఫార్మెన్స్ పరంగా కార్తికేయ తన నటనలో మరింత మెరుగు అవ్వగా లుక్స్ పరంగా యాక్షన్ సీన్స్ లో కూడా మెప్పించాడు, కామెడీ టైమింగ్ కూడా ఆకట్టుకోగా…
హీరోయిన్ కూడా ఆకట్టుకుంది, ఇద్దరి పెయిర్ మెప్పించగా మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా బాగానే నటించి మెప్పించారు, సినిమా స్టార్ట్ అవ్వడం మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా మొదలు అయ్యి ఇల్లాజికల్ సీన్స్ వస్తున్నా కానీ ఫస్టాఫ్ వరకు సినిమా బాగానే ఇంప్రెస్ చేసింది… హోమ్ మినిస్టర్ థ్రెట్ ని ఆపడానికి హీరో పడ్డ కష్టాలు అన్నీ బాగుండగా…
సెకెండ్ ఆఫ్ కంప్లీట్ గా కొత్త టర్న్ తీసుకుని కిడ్నాప్ చుట్టూ కథ ఏమంత ఆసక్తి కలిగించేలా అయితే తెరకెక్కించలేక పోయారు. కార్తికేయ తన వరకు సినిమా కోసం కష్టపడ్డా కథలో అసలు విషయం లేక పోవడంతో తను ఎంత చేసినా అది ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేక పోయింది, తర్వాత సీన్ ఏమవుతుంది అన్నది చాలా వరకు…
ఆడియన్స్ కనిపిట్టేలా ఉండటం డ్రా బ్యాక్ కాగా ఉన్నంతలో ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించేలా ఉండటం, సినిమా అంతా చాలా రిచ్ గా స్టైలిష్ గా ఉండటం, కార్తికేయ మెప్పించడం, సమ్మతమే సాంగ్ పిక్చరైజేషన్ మెప్పించడం, కొన్ని కామెడీ సీన్స్ ఆకట్టుకోవడం ప్లస్ పాయింట్స్ కాగా, కథ అస్సలు లేక పోవడం, సెకెండ్ ఆఫ్ ట్రాక్ తప్పడం…
స్లో నరేషన్ అండ్ రొటీన్ క్లైమాక్స్ మేజర్ డ్రా బ్యాక్స్ గా చెప్పాలి. అయినా కానీ కొంచం ఓపిక తో చూస్తె పర్వాలేదు అనిపించవచ్చు… పక్కా యాక్షన్ థ్రిల్లర్ చూడబోతున్నాం అని వెళితే నిరాశ తప్పదు, అంచనాలు లేకుండా సినిమా కి వెళితే ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్…