ఎలక్షన్స్ సీజన్ స్టార్ట్ అవ్వడంతో పొలిటికల్ నేపధ్యంలో సినిమా లు వస్తున్నాయి. రీసెంట్ గా బాక్ టు బాక్ పొలిటికల్ నేపధ్యంలో సినిమాలు వచ్చాయి…యాత్ర2(Yatra2 Movie) డీసెంట్ రివ్యూలు సొంతం చేసుకున్నా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ చూపించ లేక డిసాస్టర్ రిజల్ట్ ను కన్ఫాం చేసుకుంది…
కానీ మరో సినిమా రాజధాని ఫైల్స్(Raajadhani files Movie) సినిమా ట్రైలర్ రిలీజ్ తో కాంట్రవర్సీలను భారీగానే క్రియేట్ చేసింది. 2 రోజుల్లో ఆ సినిమా ట్రైలర్ కి 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడంతో జనాలలోకి సినిమా బాగానే వెళ్ళేలా ఉంది అనిపించగా సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ మిక్సుడ్ గానే ఉండగా…
సినిమాలో రైతులను ఉద్దేశ్యించి తీసిన కొన్ని సీన్స్ బాగున్నా కానీ ఓవరాల్ గా సినిమా క్వాలిటీ టేకింగ్ అంతంత మాత్రంగానే ఉండటంతో టాక్ మిక్సుడ్ గానే వచ్చింది, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా రిలీజ్ కి కొన్ని చోట్ల ఇబ్బందులు రాగా సినిమా చాలా వరకు థియేటర్స్ లోనే ఉన్నప్పటికీ కూడా….
కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను అయితే చూపించ లేక పోయింది. మొత్తం మీద సినిమా 50 లక్షల లోపే గ్రాస్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా…. డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీసేస్తే షేర్ కూడా పెద్దగా ఏమి ఉండదు… ట్రైలర్ క్లిక్ అవ్వడంతో…
బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా ఎంతో కొంత జోరు చూపిస్తుంది అనుకున్నా కూడా జనాలు అనుకున్న రేంజ్ లో సినిమా లేక పోవడంతో పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించ లేక ఈ సినిమా కూడా డిసాస్టర్ గా నిలిచింది. ఇక రామ్ గోపాల్ వర్మ తీసిన మరో 2 పొలిటికల్ మూవీస్ త్వరలో రిలీజ్ కానున్నాయి. మరి వాటి రిజల్ట్ లు ఎలా ఉంటాయో చూడాలి.