Home న్యూస్ రాజధాని ఫైల్స్ మూవీ టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!

రాజధాని ఫైల్స్ మూవీ టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!

0

ఎలక్షన్స్ దగ్గర పడుతూ ఉండటంతో పొలిటికల్ నేపధ్యంలో సినిమాలు వరుస పెట్టి రిలీజ్ అవుతున్నాయి…రీసెంట్ గా యాత్ర2(Yatra2 Movie) రిలీజ్ అవ్వగా ఆడియన్స్ పెద్దగా సినిమాను ఆదరించలేదు… ఇక ఇప్పుడు రాజధాని ఫైల్స్(Raajadhani files Movie Review) అంటూ మరో సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది….

ట్రైలర్ కి ఓవరాల్ గా సాలిడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఆశగా ఎదురు చూశారు, సినిమా కథ విషయానికి వస్తే కొత్త రాజధాని కోసం భూములు సేకరించి రాజధాని కొత్త ప్రభుత్వం మార్చడంతో ఆ భూములు కొన్న రైతుల పరిస్థితి ఏమయింది…. తర్వాత కథ ఏంటి అనేది సినిమా స్టొరీ పాయింట్ గా తెరకెక్కింది….

టోటల్ గా ఫిక్షనల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుత రాజకీయాలను ప్రభావితం చేసేలా కొన్ని సీన్స్ ఉండగా, చాలా వరకు సీన్స్ బోర్ ఫీల్ అయ్యేలా చేయడం, లో ప్రొడక్షన్ వాల్యూస్, లాగ్ ఉండటం తో డ్రాగ్ అయినట్లు అనిపించింది…. అక్కడక్కడా కొందరిని రిఫెరెన్స్ చేస్తూ చేసిన సీన్స్ బాగున్నా కూడా…

సినిమా ఎక్కువ శాతం డ్రాగ్ అవుతూనే సాగింది… సీనియర్స్ యాక్టర్స్ వినోద్, వాణీ విశ్వనాథ్ లాంటి వాళ్ళు తమ రోల్స్ కి బాగా న్యాయం చేసినా కూడా స్క్రీన్ ప్లే పరంగా చాలా నీరసంగా సాగుతుంది సినిమా… కానీ రైతులు భూముల కోసం చేసిన పోరాటం, కొన్ని చోట్ల ఎమోషన్స్ బాగానే పండాయి అని చెప్పాలి…

మొత్తం మీద ట్రైలర్ చూసి సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది అని అంచనాలతో వెళితే మట్టుకు సినిమా అంతగా నచ్చే అవకాశం తక్కువే, కానీ పార్టు పార్టులుగా కొన్ని సీన్స్ బాగానే ఉండటంతో కొంచం ఓపిక ఎక్కువ చేసుకుని చూస్తె సినిమా ఒక సారి ట్రై చేయోచ్చు అనిపించేలా ఉంది… ఓవరాల్ గా సినిమా యావరేజ్ లెవల్ లో ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here