కెరీర్ మొదలు పెట్టి 5 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క క్లీన్ హిట్ ని కూడా సొంతం చేసుకోలేదు అన్న అపవాదు ని సొంతం చేసుకున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఎట్టకేలకు రీసెంట్ గా క్లీన్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన రాక్షసన్ సినిమా ను తెలుగు లో రాక్షసుడు పేరు తో రీమేక్ చేయగా సినిమా తెలుగు లో స్లో స్టార్ట్ ని….
సొంతం చేసుకున్నా కానీ లాంగ్ రన్ ని కూడా సొంతం చేసుకుని అనుకున్న టార్గెట్ ని అందుకుని క్లీన్ హిట్ గా నిలిచి 5 ఏళ్లలో బెల్లం కొండ ఖాతాలో మొదటి హిట్ గా నిలిచింది. కాగా సినిమా ను తర్వాత జెమినీ టీవీ వారు సుమారు 6 కోట్ల రేంజ్ రేటు చెల్లించి…
శాటిలైట్ రైట్స్ హక్కులను సొంతం చేసుకోగా రీసెంట్ గా సినిమా ను టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు. కాగా మొదటి సారి టెలికాస్ట్ అయిన టైం లో పోటి లో ఇతర చానెల్స్ లో మూవీస్ టెలికాస్ట్ అయినా కానీ రాక్షసుడు సినిమా కి మంచి TRP రేటింగ్ దక్కిందని చెప్పొచ్చు.
సినిమా 10.1 TRP రేటింగ్ మొదటి టెలికాస్ట్ దక్కగా ఛానెల్ TRP రేటింగ్ తో సంతోషంగా ఉన్నారని తెలుస్తుంది, ఎందుకంటే సినిమా కాన్సెప్ట్ డిఫెరెంట్ అవ్వడం తో ఆ హత్యలు లాంటివి టెలివిజన్ లో చూస్తారో లేదో అనుకున్నా 10.1 TRP రేటింగ్ అంటే సినిమా జానర్ కి మంచి TRP రేటింగ్ అనే చెప్పాలి.
ఈ సినిమాను కొన్న జెమినీ టీవీ మొదటి టెలికాస్ట్ లోనే చాలా వరకు మనీ ని రికవరీ చేసుకోగా తర్వాత టెలికాస్ట్ లతో సినిమా వల్ల వాళ్ళు లాభాల పట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ తన తర్వాత సినిమా ను త్వరలోనే మొదలు పెట్టె పనిలో బిజీ గా ఉన్నాడు.