Home న్యూస్ 11 బిలియన్స్ ఏంటి సామి….మామూలు క్రేజ్ కాదిది!!!

11 బిలియన్స్ ఏంటి సామి….మామూలు క్రేజ్ కాదిది!!!

0

మూడేళ్ళ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టిన రామ్ పోతినేని తర్వాత రెడ్ మూవీ తో సూపర్ హిట్ అందుకోగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తెలుగు తో పాటు తమిళ్ లో ఏక కాలంలో చేస్తున్న లేటెస్ట్ మూవీ ది వారియర్ తో రావడానికి సిద్ధం అవుతూ ఉన్నాడు. కాగా ఈ సినిమా జులై 14న రిలీజ్ కానుండగా సినిమా టీసర్ కి సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని బుల్లెట్ సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని అందుకోగా రీసెంట్ గా వచ్చిన విజిల్ సాంగ్ కూడా కుమ్మేస్తుంది. ఇక బుల్లెట్ సాంగ్ ఇతర ప్లాట్ ఫామ్స్ లో కూడా సాలిడ్ రీచ్ ని సొంతం చేసుకుంది.

No Stopping for the Ram Pothineni's Bullet Song

షార్ట్ వీడియో యాప్ అయిన మోజ్ లో ఈ సాంగ్ పైన ఏకంగా 11 బిలియన్స్ కి పైగా ప్లే వ్యూస్ ఉన్నాయని సమాచారం. ఇది బిగ్గెస్ట్ రికార్డ్ అని అంటున్నారు, ఈ రేంజ్ లో వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ సాంగ్ సాలిడ్ రీచ్ ని దక్కించుకుంది, దాంతో సినిమా పై క్రేజ్ మరింతగా పెరగగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడానికి ఛాన్స్ ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here