Home న్యూస్ 2022 టాలీవుడ్ ఫస్టాఫ్ లో టోటల్ హిట్ మూవీస్ ఇవే!!

2022 టాలీవుడ్ ఫస్టాఫ్ లో టోటల్ హిట్ మూవీస్ ఇవే!!

0

2022 ఇయర్ మొదలు అయ్యి ఆల్ మోస్ట్ సగం ఏడాది కూడా గడచి పోయింది అని చెప్పాలి. ఈ ఫస్టాఫ్ లో పెద్ద హీరోలు నటించిన సినిమాలు చాలానే రిలీజ్ అవ్వగా చిన్న అండ్ డబ్బింగ్ మూవీస్ కూడా గట్టిగానే రిలీజ్ అయ్యాయి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గీతని దాటిన సినిమాలు మాత్రం వేళ్ళ మీదే లెక్క పెట్టొచ్చు అని చెప్పాలి. పేరుకు చాలా సినిమాలు రిలీజ్ అయినా కానీ అందులో…

స్ట్రైట్ తెలుగు సినిమాల పరంగా చూసుకున్నా కొన్నే హిట్స్ గా నిలిచాయి… తెలుగు సినిమాలకు ధీటుగా ఈ సారి డబ్బింగ్ మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ గా నిలిచాయి. ఒకసారి ఫస్టాఫ్ లో కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని హిట్ గా నిలిచిన సినిమాలను గమనిస్తే…

నాగార్జున నాగ చైతన్య ల కాంబోలో వచ్చిన బంగార్రాజు సినిమా లాంగ్ రన్ లో ఓవరాల్ గా జస్ట్ క్లీన్ హిట్ గా నిలిచింది, అయినా కానీ ఇయర్ ఫస్ట్ హిట్ గా నిలిచింది. తర్వాత డిజే టిల్లు సినిమా చిన్న సినిమానే అయినా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇక తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ మమ్మోత్ మూవీ ఆర్ ఆర్ ఆర్ ఆల్ టైం తెలుగు వర్షన్ రికార్డులు అన్నింటినీ బ్రేక్ చేసి ఈ ఇయర్ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దాంతో పాటు టాలీవుడ్ సెకెండ్ హైయెస్ట్ కలెక్షన్స్ మూవీగా నిలిచింది. తర్వాత కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా తెలుగు లో 100 కోట్లకు పైగా షేర్ తో సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక తర్వాత చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన డాన్ మూవీ సూపర్ హిట్ గా నిలవగా జూన్ నెలలో మేజర్ సినిమా బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా విక్రమ్ మూవీ ఏకంగా డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొత్తం మీద 4 తెలుగు మూవీస్ 3 డబ్బింగ్ మూవీస్ టాలీవుడ్ లో బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ గా నిలిచాయి. ఇక సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ అయ్యే సినిమాల్లో ఏవి అద్బుతాలు సృష్టిస్తాయో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here