బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న యాక్షన్ హీరో గోపీచంద్ తనకి కెరీర్ లో లక్ష్యం మరియు లౌక్యం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్షన్ లో ఇప్పుడు హాట్రిక్ మూవీగా ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ రామ బాణం సినిమాతో వచ్చేశాడు. మరి ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుంది లాంటి విషయాలను తెలుసుకుందాం పదండీ…
ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే… చిన్నప్పుడే తన అన్న జగపతిబాబు తో గొడవ వలన ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయినా హీరో మాఫియా విలన్ దగ్గర చేరతాడు. కొన్నేళ్ళ తర్వాత తన ఫ్యామిలీ తో తిరిగి కలవడానికి వెళ్ళిన హీరో… ఆ తర్వాత తన అన్నకి ఒక ప్రాబ్లం ఉందని తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు అన్నది అసలు కథ…
కథ పాయింట్ పరంగా ఓ 10 -15 ఏళ్ల క్రితం నాటి కథతో తెరకెక్కిన సినిమానే రామ బాణం సినిమా…. ఏమాత్రం కొత్తదనం లేని కథతో వచ్చిన ఈ కమర్షియల్ ఫార్ములా సబ్జెక్ట్ మూవీ లో చాలా వరకు సన్నివేశాలను ఈజీగా ఊహించడం, అలా ఊహించినట్లే సినిమా కథ నడవడంతో ఏ దశలో కూడా కొత్తదనంలేకుండా తెరకెక్కింది…
గోపీచంద్ మరోసారి తనకి అలవాటు అయిన నటనతో మెప్పించగా కొన్ని కామెడీ సీన్స్ లో కూడా ఆకట్టుకోగా హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక జగపతిబాబు రోల్ పర్వాలేదు అనిపించగా హీరోయిన్ రోల్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. మిగిలిన స్టార్ కాస్ట్ చాలా పెద్దదిగా ఉన్నప్పటికీ ఎవరికీ పెద్దగా ఇంపాక్ట్ ఉన్న రోల్ పడలేదు. విలన్ రోల్ కూడా పరమ రొటీన్ గా ఉందని చెప్పాలి.
ఇక సంగీతం పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరమ రొటీన్ అనిపించే విధంగా ఉండగా సినిమాటోగ్రఫీ మెప్పించగా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా మెప్పించగా ఇక శ్రీవాస్ డైరెక్షన్ విషయానికి వస్తే ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం నాటి కథతో వచ్చిన సినిమా…
ఏ దశలో కొత్తదనం అయితే లేదు, కానీ అదే టైంలో రొటీన్ మూవీస్ చూసే ఆడియన్స్ ని కొద్ది వరకు యాక్షన్ సీన్స్ తో, కామెడీ సీన్స్ తో మెప్పించగా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తెరకెక్కించిన కొన్ని ఫ్యామిలీ సీన్స్ జస్ట్ ఓకే అనిపిస్తాయి. కానీ సినిమాలో అన్ని కమర్షియల్ మూవీస్ లానే అనిపించినా అతి ముఖ్యమైన కథనే పరమ రొటీన్ గా ఉండటంతో ఏ దశలో కూడా మెప్పించలేదు…
ఓవరాల్ గా గోపీచంద్ ఫ్యాన్స్ కి కొంచం పర్వాలేదు అనిపించవచ్చు, అలాగే రొటీన్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ ఓపికతో చూస్తె అతి కష్టం మీద ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు, కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి సినిమా పరమ బోర్ కొట్టడం ఖాయం. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.25 స్టార్స్…