Home న్యూస్ W/O రణసింగం రివ్యూ….బాగుంది కానీ!!

W/O రణసింగం రివ్యూ….బాగుంది కానీ!!

0

డైరెక్ట్ రిలీజ్ లో భాగంగా లేటెస్ట్ గా పే పెర్ వ్యూ పద్దతి ని ఇంట్రొడ్యూస్ చేయగా… ఈ పద్దతి లో కోలివుడ్ నుండి ఒక సినిమా బాలీవుడ్ నుండి ఒక సినిమా రిలీజ్ అవ్వగా బాలీవుడ్ మూవీ ఫట్ అనిపించుకోగా కోలివుడ్ మూవీ మాత్రం దుమ్ము లేపే రేంజ్ లో దూసుకు పోతుంది… విజయ్ సేతుపతి ఐశ్యర్వ రాజేష్ ల కాంబినేషన్ లో వచ్చిన W/O రణ సింగం ఇప్పుడు తెలుగు లో కూడా డబ్ అయింది.

తెలుగు తో పాటు హిందీ అండ్ మిగిలిన సౌత్ భాషల్లో కూడా డబ్ అయిన ఈ సినిమా సేం పే పెర్ వ్యూ పద్దతి లో రిలీజ్ అవ్వగా సినిమా తెలుగు లో ఎలా ఉంది, ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే…

చిన్న ఊరిలో ఉండే రణసింగం కి విప్లవ భావాలు ఎక్కువగా, ఊరిలో జరిగే వచ్చే ఏ చిన్న సమస్య అయినా తను ముందుండి పోరాడుతాడు… ఈ క్యారక్టర్ నచ్చడం తో హీరోయిన్ ఐశ్యర్వ రాజేష్ ప్రేమించగా తర్వాత ఇద్దరి పెళ్లి అవుతుంది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత…..

హీరో దుబాయ్ కి ఉద్యోగం కోసం వెళ్ళాల్సి వస్తుంది, తర్వాత అనుకోని పరిస్థితులు ఎదురు అవుతాయి, హీరో పనిచేసే పరిశ్రమ లో గొడవల వలన హీరో చనిపోయాడు అని తెలుస్తుంది, తన మృతదేహాన్ని తిరిగి రప్పించాలంటే అది కుదరదు… మరి హీరోయిన్ ఎలా పోరాడింది, అసలు ఏం జరిగింది లాంటివి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి రోల్ చిన్నదే అయినా తనవరకు బాగా మెప్పించగా సినిమాలో మెయిన్ పిల్లర్ మాత్రం ఐశ్యర్వ రాజేష్ అనే చెప్పాలి, సినిమా మొత్తాన్ని తన భుజాన మోసిన ఐశ్యర్వ సెకెండ్ ఆఫ్ లో అయితే అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది.

మిగిలిన క్యారక్టర్ లు కూడా ఉన్నంతలో మెప్పించినా కానీ మొత్తం మీద సినిమా ఐశ్యర్వ రాజేష్ వన్ వుమన్ షో అనే చెప్పాలి. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు మెప్పించగా… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే వీక్ గా ఉన్నాయి. లెంత్ మరీ ఎక్కువ అయింది…

డైలాగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగుండగా… డైరెక్షన్ కూడా బాగుంది… వేరే దేశాల్లో పనుల కోసం వెళ్ళే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎలాంటి కష్టాలు పడాల్సి వస్తుంది లాంటివి చాలా బాగా చూపెట్టారు. కానీ అది కొంచం లెంత్ తగ్గించి కూడా చూపెట్టి ఉండొచ్చు…

ఇక్కడ సినిమా కి లెంత్ అండ్ స్లో నరేషన్ మేజర్ మైనస్ పాయింట్స్ గా నిలిచాయి, దానికితోడు ఇది విజయ్ సేతుపతి సినిమా కదా అని సినిమా మొత్తం తన మీదే ఉంటుంది అనుకుంటే షాక్ అవ్వక తప్పదు… రొటీన్ మూవీస్ చూసే వాళ్ళు కూడా కష్టం మీద ఒకసారి చూడొచ్చు.

మొత్తం మీద ఓపిక చేసుకుని చూస్తె సినిమా మెప్పిస్తుంది, ఐశ్యర్వ రాజేష్ పెర్ఫార్మెన్స్ కోసం ఒకసారి సినిమా చూడొచ్చు. లెంత్ విషయం లో కొంచం శ్రద్ద తీసుకుని ఉంటే బాగుండేది. మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here