Home న్యూస్ రంగరంగా వైభవంగా రివ్యూ!!

రంగరంగా వైభవంగా రివ్యూ!!

0

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చినా కానీ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన కొండ పొలం సినిమాతో భారీ డిసాస్టర్ ను సొంతం చేసుకున్న పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రంగ రంగ వైభవంగా సినిమా ట్రైలర్ అండ్ సాంగ్స్ మరీ కొత్తదనం లేక పోయినా పర్వాలేదు అనిపించాయి. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసు కుందాం పదండీ… ముందుగా సినిమా కథ పాయింట్ విషయానికి వస్తే….

చిన్నప్పటి నుండి హీరో హీరోయిన్స్ ఈగో క్లాషెస్ వల్ల మాట్లాడుకోరు.. ఎదురింట్లోనే కలిసి ఉండే 2 ఫ్యామిలీస్ లో అనుకోకుండా క్లాషెస్ వస్తాయి. మరి హీరో హీరోయిన్స్ ఎలా కలిసారు తమ ఫ్యామిలీస్ ని ఎలా కలిపారు అన్నది స్టొరీ పాయింట్… కథ పాయింట్ చాలా రొటీన్ అని మొదటి సీన్ నుండే తెలుస్తుంది, కథ లో తర్వాత సీన్ ని ఆడియన్స్ ఈజీగా గెస్ చేయడం అదే విధంగా ఆ సీన్ ఉండటం ఇలానే సాగుతుంది సినిమా మొత్తం….

పెర్ఫార్మెన్స్ పరంగా వైష్ణవ్ తేజ్ అండ్ కెతిక శర్మల పెయిర్ ఫ్రెష్ గా ఆకట్టుకోగా నవీన్ చంద్ర రోల్ మెప్పిస్తుంది, మిగిలిన స్టార్ కాస్ట్ పెద్దదిగా ఉండగా వాళ్ళు కూడా పర్వాలేదు అనిపించారు, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకోగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరమ రొటీన్ అనిపిస్తాయి. ఇక సినిమాటోగ్రఫీ బాగా మెప్పించగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా మెప్పించాయి… ఇక డైరెక్షన్ విషయానికి వస్తే…

డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ ఎంత రొటీన్ గా ఉందొ తెరకెక్కించిన విధానం కూడా అలానే రొటీన్ గా ప్రిడిక్టబుల్ గా ఉంది, ఇలాంటి రొటీన్ కథలు కూడా స్క్రీన్ ప్లే, కామెడీ, మెప్పిస్తే ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే చాన్స్ ఉంటుంది కానీ ఇక్కడ అవి బెడది కొట్టాయి. మొత్తం మీద కొన్ని సీన్స్ పార్టుపార్టులుగా బాగున్నాయి కానీ కథ పరంగా మాత్రం నిరాశ పరిచింది అని చెప్పాలి. మొత్తం మీద… ఈ సినిమా ఫక్తు…

రొటీన్ మూవీ అని ముందే గమనించి ప్రిపేర్ అయి వెళితే కొన్ని సీన్స్ వరకు ఆకట్టుకుని సినిమా ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు, రీసెంట్ గా వచ్చిన డిఫెరెంట్ మూవీస్ తో కంపేర్ చేసి అలాంటి సినిమానే చూడబోతున్నాం అని వెళితే తీవ్రంగా సినిమా నిరాశపరుస్తుంది. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here