Home న్యూస్ టెలివిజన్ లో వైష్ణవ్ తేజ్ మూవీస్ రాంపెజ్….1 తప్పితే….అన్నీ కుమ్మేశాయిగా!!

టెలివిజన్ లో వైష్ణవ్ తేజ్ మూవీస్ రాంపెజ్….1 తప్పితే….అన్నీ కుమ్మేశాయిగా!!

0

మొదటి సినిమా ఉప్పెన(Uppena Movie) తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించి డెబ్యూ మూవీతో అనేక రికార్డులను నమోదు చేసిన పంజా వైష్ణవ్ తేజ్(Panja Vaishnav Tej) ఆ తర్వాత చేసిన ఏ సినిమాతో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అయితే అందుకోలేక పోయాడు అనే చెప్పాలి…

ఉప్పెన తర్వాత చేసిన కొండపోలం, రంగ రంగ వైభవంగా మరియు ఆదికేశవ సినిమాలు అన్నీ కూడా వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకున్నాయి. కానీ ఈ నాలుగు సినిమాలలో ఒక్క రంగ రంగ వైభవంగా ఒక్కటి టెలివిజన్ లో కొంచం నిరాశ పరిచే రేటింగ్ ను అందుకోగా….

మిగిలిన అన్ని సినిమాలు కూడా ఎక్స్ లెంట్ రేటింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడం విశేషం. ఒకసారి పంజా వైష్ణవ్ తేజ్ సినిమాల టి.ఆర్.పి రేటింగ్ లను గమనిస్తే… మొదటి సినిమా ఉప్పెన సినిమా 18.51 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకోగా, రెండో సినిమా కొండపోలం 12.34 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకోగా….

మూడో సినిమా రంగ రంగ వైభవంగా సినిమా 5.35 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకోగా తన లేటెస్ట్ మూవీ ఆదికేశవ 10.47 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద నాలుగు సినిమాల్లో ఒక్క సినిమా మాత్రమే నిరాశ పరచగా మిగిలిన సినిమాలు అన్నీ కూడా కుమ్మేశాయి అనే చెప్పాలి… మిగిలిన యంగ్ స్టార్స్ తో పోల్చితే టెలివిజన్ లో వైష్ణవ్ తేజ్ మూవీస్ బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here