యంగ్ హీరో నాగాషౌర్య నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణ వ్రింద విహారి ఆడియన్స్ ముందుకు ఎప్పుడో రావాల్సింది కానీ కొంచం ఆలస్యం అయినా మంచి ప్రమోషన్స్ జరుపుకున్న తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయింది. టీసర్ ట్రైలర్ లు పర్వాలేదు అనిపించేలా ఉండటంతో బజ్ ఏర్పడగా హీరో సినిమాను యూనిక్ గా ప్రమోట్ చేశాడు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంది, ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….
సాంప్రదాయ బ్రాహ్మణుడు అయిన హీరో ఒక ఐటీ కంపెనీలో పని చేస్తూ ఉండగా తన మానేజర్ అయిన హీరోయిన్ ని చూసి ప్రేమలో పడతాడు, నార్త్ ఇండియన్ అయిన హీరోయిన్ కి ఒక సమస్య ఉండగా ఆ సమస్య చెప్పకుండా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. హీరో తల్లి అయిన రాధిక శరత్ కుమార్ కొలీగ్స్ తో తన కోడలు మరీ క్లోజ్ గా ఉండటం నచ్చదు, తర్వాత గొడవలు జరగడం స్టార్ట్ అవ్వగా కథలో తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
కథ పరంగా కోర్ పాయింట్ ఆల్ మోస్ట్ కొంచం అంటే సుందరానికీ సినిమాను తలపించే విధంగా ఉన్నా ఇక్కడ మరో సమస్యని జోడించి ఫస్టాఫ్ వరకు కథ చాలా నార్మల్ గా ఉన్నప్పటికీ పర్వాలేదు అనిపించేలా కథ కొనసాగగా ఇంటర్వెల్ ట్విస్ట్ పర్వాలేదు అనిపించిన తర్వాత సెకెండ్ ఆఫ్ కూడా కథ రొటీన్ గానే అనిపించినా సీన్ బై సీన్ విసుగు అయితే తెప్పించ కుండా క్లైమాక్స్ ఎక్స్ పెర్ట్ చేసినట్లే ముగుస్తుంది…
నాగాషౌర్య నటన మెప్పించాగా హీరోయిన్ లుక్స్ బాగున్నా పెర్ఫార్మెన్స్ వీక్ అనే చెప్పాలి. రాధిక శరత్ కుమార్ నటన ఆకట్టుకోగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించారు, సంగీతం పర్వాలేదు… సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే నార్మల్ స్టొరీ పాయింట్ నే ఫ్రెష్ గా చెప్పే ప్రయత్నం చేసిన డైరెక్టర్ చాలా వరకు సీన్స్ ని బాగానే హ్యాండిల్ చేశాడు….
కానీ ఓవరాల్ గా సినిమా ప్రిడిక్ట్ చేసినట్లు కొనసాగడం, ఫస్టాఫ్ ఫ్లాట్ నరేషన్ అండ్ క్లైమాక్స్ ఎండింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. మొత్తం మీద క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవ్వడం, కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వడంతో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ కొంచం ఓపికతో చూస్తె సినిమా బాగుంది ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు…. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్….