Home న్యూస్ మాస్ రాజా మాస్…నంబర్ 1 రికార్డ్ కొట్టిన రవితేజ!!

మాస్ రాజా మాస్…నంబర్ 1 రికార్డ్ కొట్టిన రవితేజ!!

0

సోషల్ మీడియా లో రోజుకో ట్రెండ్ జరుగుతున్న విషయం తెలిసిందే, స్టార్ హీరోల సినిమాలకు వరుస పెట్టి ట్రెండ్స్ జరుగుతుండగా తర్వాత అది యంగ్ హీరోల సినిమాలకు పాకగా తర్వాత ఇప్పుడు సీనియర్ హీరోల సినిమా లకు కూడా ఈ ట్రెండ్ పాకింది. టాలీవుడ్ లో రీసెంట్ టైం లో సీనియర్ హీరోల పరంగా బాలయ్య సింహా సినిమా ట్రెండ్ రీసెంట్ గా జరిగి దుమ్ము లేపే రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఆల్ మోస్ట్ సీనియర్స్ కేటగిరీ లో ఎంటర్ అయిన మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఆల్ టైం ఎపిక్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ కిక్ వచ్చి 11 ఏళ్ళు పూర్తీ అవుతున్న కారణంగా సోషల్ మీడియా లో ఫ్యాన్స్ భారీ ఎత్తున ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు.

సైలంట్ గానే మొదలైన ట్రెండ్ గంట గంట గడుస్తున్న కొద్ది సీనియర్ హీరోల లో ప్రస్తుతం సరికొత్త రికార్డ్ నమోదు చేసే రేంజ్ లో ట్రెండ్ అయింది, రీసెంట్ గా బాలయ్య సింహా ట్రెండ్ 24 గంటల్లో 2 లక్షల 75 వేల ట్వీట్స్ ని సాధించగా ఇప్పుడు రవితేజ కిక్ మూవీ ట్రెండ్…

24 గంటలు పూర్తీ అయ్యే సరికి 3 లక్షల 10 వేలకు పైగా ట్వీట్స్ ని పోల్ చేసి నంబర్ 1 రికార్డ్ ట్రెండ్ ని సీనియర్ హీరోలలో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. రవితేజ కెరీర్ లో ఎపిక్ కామెడి ఎంటర్ టైనర్ అయిన కిక్ 2009 ఇయర్ లో మగధీర, అరుంధతీ సినిమాల తర్వాత మూడో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అప్పుడు కూడా ఒకటి రెండు ఫ్లాఫ్స్ తర్వాత వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది, తర్వాత 2015 లో ఈ సినిమా సీక్వెల్ తీసినా అది అంచనాలను అందుకోలేదు. ప్రస్తుతం వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ కిక్ రేంజ్ అల్టిమేట్ హిట్ కొట్టాలి అని అందరూ కోరుకుంటున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here