వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఓపెనింగ్స్ లో కుమ్మేస్తున్న హీరో….బ్లాక్ బస్టర్ కాంబో…..వరుస హిట్స్ తో జోరు మీదున్న హీరోయిన్… టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు నిర్మాత…ఈ ఇయర్ బెస్ట్ రిలీజ్ డేట్స్ లో ఒక డేట్ కి రిలీజ్….ఇలా కావాల్సినన్ని ఎన్నో అడ్వాంటేజ్ లను సొంతం చేసుకున్నా కూడా…
యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేతేట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించ లేక భారీ డిసాస్టర్ రిజల్ట్ ను ఇప్పుడు సొంతం చేసుకుంది….గీత గోవిందం(Geetha Govindam) లాంటి కాంబోలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ తో విజయ్ దేవరకొండ…
సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని అందరూ అనుకున్నారు కానీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ నుండే అన్నీ రివర్స్ లో వెళ్ళడం మొదలు అయ్యాయి… పాటలు ఏమాత్రం ఆకట్టుకోలేక పోవడం, ట్రైలర్ MCA మూవీని కొంచం తలపించేలా ఉండటం, ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని కామెంట్స్ కాంట్రవర్సీలకు కారణం అవ్వడం….
లాంటివి ఇంపాక్ట్ చూపించినా కూడా ఓపెనింగ్ డే నుండే సినిమా తీవ్రంగా అండర్ పెర్ఫార్మ్ చేయడం రీసెంట్ టైంలో ఈ సినిమాకే చెల్లింది….మేకర్స్ సినిమా బాగుంది కావాలని అందరూ నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు అని చెప్పి కొందరి పై కేసులు వేస్తున్నామని చెప్పినా కూడా కామన్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ స్టార్ మూవీని ఆదరించలేదు…
విజయ్ కెరీర్ లోనే రీసెంట్ టైంలో లోవేస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న తర్వాత ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది ఈ సినిమా… దాంతో రిజల్ట్ వీకెండ్ కే కన్ఫాం అయినా వర్కింగ్ డేస్ లో 2 బిగ్ హాలిడే లు ఉండటంతో సినిమా ఏమైనా గ్రోత్ ని చూపిస్తుంది అనుకున్నా అదేమీ జరగలేదు….
సినిమా మేజర్ గా ఇలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకోవడానికి కారణాలు ఏంటి అనేది టీం కి కూడా అంతుచిక్కడం లేదు…. కానీ ఎన్ని హంగులు ఉన్నా ట్రైలర్ క్లిక్ అవ్వక పోవడం, సాంగ్స్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచక పోవడం, చివరగా ప్రీమియర్స్ నుండే వచ్చిన నెగటివ్ టాక్ సినిమాను ఏ దశలో కూడా తేరుకోనివ్వలేదు….
ఇలాంటి రిజల్ట్ తర్వాత విజయ్ ఎట్టి పరిస్థితులలో తన అప్ కమింగ్ మూవీతో కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చేస్తున్న ఆ సినిమా ఇప్పుడు తన కెరీర్ కి చాలా కీలకం అని చెప్పొచ్చు. ఆ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ విజయ్ కి సొంతం అవ్వాలని మనమూ కోరుకుందాం.