మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, సినిమా పై ఈ సారి మిగిలిన సాయి ధరం తేజ్ మూవీస్ రేంజ్ లో హైప్ అయితే లేదు, దానికి ప్రధాన కారణం సినిమా కంప్లీట్ గా సీరియస్ నోట్ తో సాగే కథతో తెరకెక్కడం అని చెప్పాలి. దేవకట్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా…
ఎక్కువగా ఇప్పుడు మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి ఆడియన్స్ ముందుకు రాబోతుంది అని చెప్పాలి. ఒక్క సారి టాక్ పాజిటివ్ గా వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గ సినిమా జోరు చూపడం ఖాయమని చెప్పాలి. ఇక సినిమా బిజినెస్ కూడా జోరు అందుకోగా…
అందులో నైజాం ఏరియా కాకుండా ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాలలో బిజినెస్ ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేసింది. సినిమా కి ఆంధ్ర రీజన్ లో 5.8 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక సీడెడ్ ఏరియా కి గాను సినిమా 2.5 కోట్ల బిజినెస్ ను…
సొంతం చేసుకుందట కానీ అందులో సినిమా కలెక్షన్స్ ఆశించిన మేర రాకుంటే 50 లక్షలు రిఫండ్ ఇచ్చేలా డిస్ట్రిబ్యూటర్లు ఒప్పందం చేసుకున్నారట. ఓవరాల్ గా ఈ రెండు ఏరియాల బిజినెస్ ఇప్పుడు 8.3 కోట్ల రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. ఇక మెయిన్ నైజాం ఏరియా బిజినెస్ లెక్క ఇంకా తేలాల్సి ఉంది… ఓవరాల్ గా చూసుకుంటే సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ రేంజ్ ఇప్పుడు అటు ఇటూ గా….
14 కోట్ల రేంజ్ లో జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు…. సీరియస్ మూవీ కి ఈ రేంజ్ లో బిజినెస్ అది కూడా ఇప్పుడున్న పరిస్థితులలో అంటే అద్బుతం అనే చెప్పాలి…. మరి ఈ బిజినెస్ ఫైనల్ అవుతుందా ఫైనల్ గా ఏమైనా మార్పులు లాంటివి ఉంటావా అనేది రిలీజ్ ముందు రోజు ఫుల్ క్లారిటీ వస్తుంది.. అప్పుడు క్లియర్ గా బిజినెస్ ను అప్ డేట్ చేస్తాం…