మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఐశ్వర్య రాజేష్ ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది…. కాగా సినిమా రిలీజ్ కోసం మెగా హీరోలు అందరూ తమ వంతుగా సినిమాను ప్రమోట్ చేశారు, ట్రేడ్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది, కానీ ప్రస్తుతం ఆడియన్స్ లో సినిమా పై…
అంత బజ్ ఉందా లేదా అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓపెనింగ్స్ తో తెలుస్తుంది అని చెప్పాలి. ఇక సినిమా బిజినెస్ ను గమనిస్తే… సినిమాను నైజాం ఏరియాలో 4.5 కోట్ల రేటు కి అమ్మారు. ఇక టోటల్ ఆంధ్ర రీజన్ లో 5.8 కోట్ల రేటు కి అమ్మగా…
సీడెడ్ ఏరియాలో 2.5 కోట్ల రేటు కి అమ్మారు… దాంతో తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 12.8 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా సినిమా కి సీడెడ్ లో బిజినెస్ అందుకొక పొతే 50 లక్షలు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది, ఇక ఆంధ్రలో బిజినెస్ అందుకోక పొతే 1.1 కోట్ల దాకా వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది….
అన్న అగ్రిమెంట్ తో సినిమాను అమ్మారని సమాచారం… ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లు కలిపి మరో 80 లక్షల బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 13.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఇప్పుడు సొంతం చేసుకుంది, దాంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 14 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాలి…
ఓవరాల్ గా ఈ బిజినెస్ సాయి ధరం తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ కన్నా ఎక్కువే జరిగింది ఇప్పుడు. కానీ సినిమాను చూడటానికి జనాలు ఎంతవరకు థియేటర్స్ కి వస్తారు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది అని చెప్పాలి.