Home టోటల్ కలెక్షన్స్ పవర్ స్టార్ సినిమా బడ్జెట్, బిజినెస్ అండ్ కలెక్షన్స్ లెక్కలు తెలిస్తే షాక్!!

పవర్ స్టార్ సినిమా బడ్జెట్, బిజినెస్ అండ్ కలెక్షన్స్ లెక్కలు తెలిస్తే షాక్!!

0

రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ టైం లో కూడా తన కి తోచిన ఎదో ఒక రకమైన సినిమాలు షార్ట్ మూవీస్ చేసుకుంటూ ఎలాగోలా ప్రాఫిట్స్ ని దక్కించుకుంటున్నాడు. ఈ లాక్ డౌన్ టైం లో తను తీసిన అడల్ట్ సినిమాలు మరీ అంత ప్రాఫిట్ ఇవ్వలేదు కానీ లేటెస్ట్ గా తీసిన పవర్ స్టార్ మూవీ తో భారీ ప్రాఫిట్స్ నే సొంతం చేసుకున్నాడట రామ్ గోపాల్ వర్మ…

కాంట్రవర్సీ సీన్స్ ని బిట్స్ గా కట్ చేసి టీసర్ లు గా రిలీజ్ చేసి సినిమా పై హైప్ ని పెంచుకుని టీవి ఛానెల్స్ లో మీటింగ్ పెట్టి మరింత పబ్లిసిటీ దక్కించుకుని సినిమా టికెట్ 150 పెట్టిన వర్మ… అందరికి తన గురించి తెలిసినా కానీ…

ఎదో ఒక కాంట్రవర్సీ పెట్టి ఉంటాడని ఈ 37 నిమిషాల షార్ట్ ఫిల్మ్ ని ఎగబడి చూశారట. పైరసీ లో కూడా చాలా మంది చూసినా ఫస్ట్ డే సుమారు 1 లక్ష 20 వేల మంది తర్వాత మరో 30 వేల మంది దాకా రౌండ్ ఫిగర్ గా సినిమా ను చూశారట. తర్వాత ట్రాఫిక్ టోటల్ గా డౌన్ అయింది.

ఇక సినిమా కి రామ్ గోపాల్ వర్మ పట్టుమని 10 లక్షలు కూడా ఖర్చు చేయలేదట. కావలసినంత పబ్లిసిటీ ఛానెల్స్ ఫ్రీ గా ఇచ్చాయి. ఇక టోటల్ గా 1 లక్షా 50 వేల మందికి అటూ ఇటూగా జనాలు టికెట్ కొనుక్కుని చూడగా టోటల్ గా మనీ 2 కోట్ల 30 లక్షల రేంజ్ లో దక్కి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇది ఎంతవరకు నిజం అన్నది అఫీషియల్ గా తెలియాల్సి ఉండగా ఇదే కనుక నిజం అయితే కేవలం 10 లక్షల బడ్జెట్ తో కావలసినంత పబ్లిసిటీ చేసుకుని అల్టిమేట్ ప్రాఫిట్స్ ని దక్కించుకున్నాడు రామ్ గోపాల్ వర్మ… అందుకే ఇలాంటి కాంట్రవర్సీలనే సినిమాలుగా మరిన్ని తీయాలని ప్లానింగ్ లో ఉన్నాడని అంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here