డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తన లక్ ని పరీక్షించుకుంటున్నాడు. ఇది వరకు హీరోగా ట్రై చేసిన ఆంధ్రా పోరీ నిరాశ పరచగా తర్వాత చేసిన మెహబూబా సినిమా కూడా ఆడియన్స్ ను మెప్పించలేదు. ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు పూరీ నిర్మాణంలో అనిల్ పదురి అనే కొత్త డైరెక్టర్ తో కలిసి చేస్తున్న సినిమా రొమాంటిక్ ఆడియన్స్ ముందుకు…
ఇప్పుడు ఈ నెల 29 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. కాగా రీసెంట్ గా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ట్రైలర్ లో సినిమా కాన్సెప్ట్ ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం…
రకరకాలుగా ఉందని చెప్పాలి… కథ పాయింట్ సింపుల్ గా ఒక అమ్మయిని చూసి ఆకర్షితుడు అయ్యే హీరో ఆమె వెంట పడతాడు. ముందు నో చెప్పినా తర్వాత అమ్మాయి కూడా అబ్బాయిని ఇష్టపడుతుంది, కానీ వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఆకర్షణ మొహం ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు కానీ…
వాళ్ళని చూసిన రమ్యకృష్ణ వాళ్ళది మొహం కాదు స్ట్రాంగ్ లవ్ అని అనుకుంటుంది, మరి వీళ్ళు తమ లవ్ ని ఫీల్ అయ్యారా లేదా అన్నది సినిమా కథ అని అనిపించింది. ట్రైలర్ లో ఇది వరకు పూరీ తెరకెక్కించిన అనేక సినిమాల షాట్స్ గుర్తుకు వచ్చాయి. హీరోయిన్ గ్లామర్ షో సినిమా కి ప్లస్ అయ్యేలా ఉండగా ఆకాష్ పూరీ కూడా ఇంప్రూవ్ అయినట్లు అనిపిస్తుంది.
రమ్యకృష్ణ రోల్ కూడా బాగానే ఉన్నట్లు కనిపిస్తుండగా యూత్ ని మాత్రమే టార్గెట్ చేసిన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ట్రైలర్ మట్టుకు సినిమాపై ఎంతో కొంత బజ్ ని పెంచేలా ఉందని చెప్పాలి. మరి సినిమా ఎలా ఉంటుంది ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి ఇక…