Home న్యూస్ కొన్ని గంటలకే ఇండియన్ రికార్డ్ ఔట్ అక్కడ….భీభత్సం ఇది!!

కొన్ని గంటలకే ఇండియన్ రికార్డ్ ఔట్ అక్కడ….భీభత్సం ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ వరల్డ్ వైడ్ గా 10 వేలకి పైగా థియేటర్స్ లో అత్యంత ఘనంగా రిలీజ్ ను సొంతం చేసుకోగా అందుకోవాల్సిన టార్గెట్ కొండంత ఉన్నా కానీ సినిమా ఆ అంచనాలను అందుకునే రేంజ్ లోనే బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ పరంగా దుమ్ము దుమారం చేయడానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి. సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుని…

ఇప్పుడిప్పుడే షోలు పడటం స్టార్ట్ అవ్వగా అన్ని చోట్లా రోజు ముగిసే సరికి సినిమా కలెక్షన్స్ రికార్డులు నెక్స్ట్ లెవల్ లో ఉండే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పూర్తీ కాక ముందే ఆల్ ఇండియా రికార్డులను తిరగరాసి సంచలనం సృష్టించింది ఈ సినిమా…

అమెరికా ప్రీమియర్ షోల పరంగా ఇది వరకు బాహుబలి 2 సినిమా 2.45 మిలియన్ డాలర్ కలెక్షన్స్ తో ఆల్ టైం రికార్డ్ కొట్టగా ఆ రికార్డ్ 5 ఏళ్ళుగా ఉండగా ఆ రికార్డ్ ను ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా కొన్ని గంటల వ్యవధిలోనే బ్రేక్ చేసి ఆల్ టైం న్యూ రికార్డ్ ను క్రియేట్ చేసి…

ఊచకోత కోయగా ఓవరాల్ గా 3 మిలియన్ డాలర్ మార్క్ ని అందుకుని ఇండియన్ మూవీస్ లో అమెరికాలో 3 మిలియన్ డాలర్స్ ని వసూల్ చేసిన ఫస్ట్ మూవీ గా చరిత్ర సృష్టించింది, ఫైనల్ లెక్క 3.4-3.5 మిలియన్ దాకా వెళ్ళే అవకాశం ఉందని అంటూ ఉండగా అమెరికాలో మిగిలిన సినిమాలతో కంపేర్ చేస్తే ఈ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ తో నంబర్ 1 గా…

ఆర్ ఆర్ ఆర్ సినిమా అక్కడ నిలిచింది అని అంటున్నారు, ఇక ప్రీమియర్స్ అలాగే మొదటి రోజు కలెక్షన్స్ తో కలిపి ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆల్ టైం రికార్డ్ లను అక్కడ సొంతం చేసుకోవడం ఖాయం అవ్వగా ఆ రేంజ్ ఏ లెవల్ లో ఉంటుంది అన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారింది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ తో ఓపెన్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here