బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రతీ రోజూ కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును సూపర్ సాలిడ్ గా కొనసాగించింది, సినిమా మొదటి 5 రోజుల్లో అనుకున్న అంచనాలను మించి పోయి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు మాత్రం సినిమా అంచనాలను తప్పింది. తెలుగు రాష్ట్రాలలో సినిమా కి 6 వ రోజున…
మొత్తం మీద 10 కోట్ల నుండి 10.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని భావించినా కానీ సినిమా ఆ మార్క్ ని అందుకోలేక పోయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 6 వ రోజు 9.54 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకుని అనుకున్న అంచనాల కన్నా కూడా 1 కోటి దాకా…
తక్కువ వసూళ్ళని సొంతం చేసుకోగా టాలీవుడ్ చరిత్ర లో 6 వ రోజు అత్యధిక కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా ఇది వరకు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా 9.52 కోట్ల షేర్ తో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టగా ఆర్ ఆర్ ఆర్ ఈజీగా 10 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయి అనుకున్నా…
మొత్తం మీద సరిలేరు నీకెవ్వరు కన్నా జస్ట్ 2 లక్షల లీడ్ తో ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని 6వ రోజు సొంతం చేసుకుంది. ఇక 6వ రోజు ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన టాప్ మూవీస్ ని గమనిస్తే…
👉#RRRMovie – 9.54CR
👉#SarileruNeekevvaru – 9.52Cr
👉#AlaVaikunthapurramuloo – 9.44Cr
👉#Baahubali2 -9.22Cr
👉#Syeraa- 5.56Cr
👉#F2 -5.21Cr
👉#KhaidiNo150: 4.86Cr
👉#Baahubali -4.84Cr
👉#VakeelSaab – 4.83Cr
👉#VinayaVidheyaRama – 4.2Cr
సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠ పురంలో సినిమాలు సంక్రాంతికి నువ్వా నేనా అన్నట్లు కలెక్షన్స్ జాతర సృష్టించగా బాహుబలి 2 మరియు ఆర్ ఆర్ ఆర్ మూవీస్ సమ్మర్ రేసు లో నిలవగా ఆర్ ఆర్ ఆర్ మూవీ కి టికెట్ హైక్స్ ఉన్నా ఇంకొంచం ఎక్కువ వసూళ్ళని అందుకుని లీడ్ చూపిస్తుంది అనుకున్నా జస్ట్ 2 లక్షలతో రికార్డ్ కొట్టింది. ఇక మిగిలిన రోజుల్లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి…